Home
News

క్రికెట్ లవర్స్‌కు జియో బంపరాఫర్.. ఈ ప్లాన్ తీసుకుంటే IPLతో పాటు హాట్‌స్టార్ కూడా ఫ్రీ..

IPL 2025: ఇంకో 3-4 వారాల్లో IPL 2025 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇవి చూడాలంటే, మీ దగ్గర జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. గతంలో జియో సినిమా యాప్‌లో ఫ్రీగా చూసేవాళ్లం, కానీ ఈసారి డబ్బులు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 3-నెలలకు రూ. 149 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ప్రీమియం ప్లాన్ కావాలంటే ఏడాదికి రూ.1,499 వరకు ఉంటుంది. అయితే జియో యూజర్లు ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

ఎలా అంటారా? జియో అందిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. ఆ ప్లాన్స్ ఎంచుకుంటే సరి. జియో రూ.198 నుంచే అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్స్ కూడా ఇస్తోంది. ఇవి తీసుకుంటే IPL మ్యాచ్‌లు బఫరింగ్ లేకుండా చూడొచ్చు. IPL 2025 కోసం బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవో చూద్దాం.

IPL 2025  Best Jio Prepaid Plans for Streaming the Indian Premier League

* జియో రూ.949 ప్లాన్

ఎక్కువ కాలం పాటు ప్లాన్ ఉండాలి, IPL కూడా చూడాలి అనుకునేవాళ్లకి రూ.949 ప్లాన్ మంచి ఛాయిస్. ఇందులో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. అంతేకాదు, రోజుకి 2GB 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు కూడా ఇస్తారు.

ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుండటంతో IPL సీజన్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు. ఇదొక్క ప్లాన్ తీసుకుంటే అసలు మళ్లీ ఐపీఎల్ కోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాదు. ప్రస్తుతానికి ఐపీఎల్ లవర్స్‌కు దీనికి మించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ మరొకటి లేదంటే అతిశయోక్తి.

* జియో రూ.198 ప్లాన్ - బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్

తక్కువ ధరలో ప్లాన్ కావాలనుకునే వాళ్లకి రూ.198 ప్లాన్ బెస్ట్. ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకి 2GB 4G డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్లాన్ 14 రోజుల పాటు వాలిడిటీతో వస్తుంది. ఇంకా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్‌కి కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది..

కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇందులో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉండదు. IPL చూడాలంటే సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఆర్థికంగా కొంచెం భారం మోపుతుంది కాబట్టి ఐపీఎల్ లవర్స్ దీనితో రీఛార్జ్ చేసుకునే ముందు ఒకట్రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

* జియో రూ.349 ప్లాన్

రూ.349 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకి 2GB 4G డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇస్తారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియోటీవీ, జియోసినిమా సబ్‌స్క్రిప్షన్లు కూడా ఫ్రీగా ఇస్తారు. ఎక్కువ ఖర్చు లేకుండా IPL చూడాలనుకునే వాళ్లకి ఇది మంచి ప్లాన్.

* జియో రూ. 399 ప్లాన్

ఈ ప్లాన్‌లో రోజుకి 2.5GB 4G డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అదనం. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఎక్కువ డేటా కావాలనుకునే వాళ్లకి, హై క్వాలిటీలో స్ట్రీమింగ్ చేసేవాళ్లకి, IPLతో పాటు వేరే పనులకూ డేటా వాడుతూ చేసేవాళ్లకి ఈ ప్లాన్ బాగా సూటవుతుంది.

* జియో రూ.448 ప్లాన్

ఓటీటీ కంటెంట్ పిచ్చెక్కి చూసేవాళ్లకి, క్రికెట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కావాలి అనుకునేవాళ్లకి రూ.448 ప్లాన్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకి 2GB 4G డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కామన్. కానీ స్పెషల్ ఏంటంటే, జియోటీవీ ద్వారా 12 ఓటీటీ యాప్స్‌కి ఫ్రీ యాక్సెస్ ఇస్తారు.

అవేంటంటే, సోనీ LIV, ZEE5, సన్ NXT, డిస్కవరీ+, లయన్స్‌గేట్ ప్లే, హోయిచోయ్ ఇంకా చాలా ఉన్నాయి. IPLతో పాటు ఓటీటీ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ ప్లాన్ ది బెస్ట్.

* IPL 2025 కోసం సరైన ప్లాన్ ఎలా ఎంచుకోవాలి

జియో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా ఇస్తోంది. కానీ రోజుకి కనీసం 2GB డేటా ఉన్న ప్లాన్స్‌కే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది గుర్తుపెట్టుకోవాలి. IPL స్ట్రీమింగ్ బెస్ట్ క్వాలిటీలో చూడాలంటే, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న ప్లాన్ తీసుకోవడం బెటర్. లేదా సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ కొనుక్కోవాలి. లాంగ్-టర్మ్ ప్లాన్‌కు రూ.949 ప్లాన్ బెస్ట్, లో-బడ్జెట్‌కు రూ.198 ప్లాన్ ఓకే అనిపిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio prepaid plans for IPL 2025 streaming on Hotstar. Rs 949 plan includes free Hotstar, unlimited 5G data. Budget and OTT plans available. Choose plan with Hotstar or subscribe separately.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X