Home
News

IPL 2025 సందర్బంగా Vi అదిరిపోయే ఆఫర్.. కొత్త కస్టమర్లకు 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ ఫ్రీ..

Vodafone Idea JioHotstar subscription: దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) IPL 2025 సీజన్ కోసం ఒక సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఎవరైతే కొత్త Vi సిమ్ తీసుకుంటారో, వాళ్లు సిమ్ యాక్టివేట్ చేసుకుని ఫస్ట్ రీఛార్జ్ చేసుకుంటే చాలు. అప్పుడే మీకు 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వచ్చేస్తుంది.

రీఛార్జ్ చేసిన 12 గంటల్లోనే ఈ బెనిఫిట్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతుంది. అంతేకాదు, మీకు SMS కూడా వస్తుంది. మొదటి నెల అయిపోయాక, రెండో నెల, మూడో నెల కూడా ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలంటే, మీ Vi ప్రీపెయిడ్ ప్లాన్ అయిపోయిన 48 గంటల్లోపు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలి.

IPL 2025 Vi and Airtel Free JioHotstar Offers  Watch Live IPL Streaming

* ఎవరెవరు అర్హులు? ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాలి?

ఈ ఫ్రీ జియోహాట్‌స్టార్ ఆఫర్ కొత్త Vi యూజర్లకు మాత్రమే. అది కూడా 2025, మార్చి 23 తర్వాత సిమ్ యాక్టివేట్ చేసుకున్న వాళ్లకే వర్తిస్తుంది. ఈ అదిరిపోయే ఆఫర్ అందుకోవాలంటే, Vi కొత్త కస్టమర్లు తప్పనిసరిగా ఈ కింద ఇచ్చిన ప్లాన్స్‌లో ఏదో ఒక దానితో రీఛార్జ్ చేసుకోవాలి.

* రీఛార్జ్ చేసుకోవాల్సిన ప్లాన్లు..

రూ.299, రూ.349, రూ.365, రూ.375 ప్లాన్‌లు రీఛార్జ్ చేసుకుంటే, కొత్త Vi యూజర్లకు 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. కాబట్టి, IPL అభిమానులు ఎంచక్కా ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుని, అదనపు ఖర్చు లేకుండా మ్యాచ్‌లు చూడొచ్చు.

ఈ ప్లాన్స్ అన్నీ 3 నెలల జియోహోట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. IPL మ్యాచ్‌లు చూడాలనుకునే వాళ్లకి ఇది మంచి ఆఫర్. ఎక్స్‌ట్రాగా ఓటీటీ కోసం డబ్బులు కట్టక్కర్లేదు. మీ ఏరియాలో ఇంకా ఏమైనా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయేమో తెలుసుకోవాలంటే, Vi కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి లేదా దగ్గరలోని Vi స్టోర్‌కు వెళ్లి కనుక్కోండి.

* ఎయిర్‌టెల్, Vi లలో IPL కోసం అదిరిపోయే డేటా ప్యాక్స్ కూడా వచ్చేశాయ్

కొత్త యూజర్ల కోసం Vi ఆఫర్ ఒక ఎత్తైతే, ఇప్పుడున్న కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్, Vi రెండూ స్పెషల్ క్రికెట్ డేటా ప్యాక్స్, ప్లాన్స్ కూడా తీసుకొచ్చాయి. వీటిల్లో జియోహోట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వస్తుంది. IPL మ్యాచ్‌లు స్ట్రీమింగ్ చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

* ఎయిర్‌టెల్ క్రికెట్ ప్యాక్స్ వివరాలు

ఎయిర్‌టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్యాక్స్‌తో జియోహాట్‌స్టార్ ఆఫర్ ఇస్తోంది. రూ.100 ప్యాక్ 5GB డేటా, 30 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. రూ.195 ప్యాక్ 15GB డేటా, 90 రోజుల జియోహోట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ డేటా వోచర్లు మాత్రమే. అంటే, కాలింగ్ కోసం ఒక బేస్ ప్లాన్ యాక్టివ్‌లో ఉండాలి.

* Vi క్రికెట్ ప్యాక్స్ వివరాలు

Vi ఒక డేటా వోచర్, రెండు స్టాండలోన్ రీఛార్జ్ ప్లాన్స్‌తో జియోహాట్‌స్టార్ బెనిఫిట్స్ ఇస్తోంది. రూ.101 డేటా వోచర్ 5GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. స్టాండలోన్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో జియోహాట్‌స్టార్ వస్తుంది, కానీ కాలింగ్, SMS కోసం బేస్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి.

జియోహాట్‌స్టార్ ఉంటే, IPL మ్యాచ్‌లు 4K క్వాలిటీలో చూడొచ్చు. అంతేకాదు, సినిమాలు, షోలు, యానిమే, డాక్యుమెంటరీలు కూడా మొబైల్‌లో, టీవీలో ఎంచక్కా చూసేయొచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea offers new customers a free 3-month JioHotstar subscription with select prepaid plans for IPL 2025. Airtel also launches cricket packs with JioHotstar access.1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X