ఉచితం హుష్ కాకి : జియో సిమ్ ఖరీదు రూ. 500 !

Written By:

అందరికీ జియో సిమ్ తో పాటు డేటాను ప్రివ్యూ ఆపర్ కింద ఉచితంగా అందిస్తామంటూ ముకేష్ అంబాని చెబుతుంటే మరికొందరు మాత్రం జియో సిమ్ లను బ్లాక్ లో అమ్మేస్తున్నారు. జియో ఉచిత ఆఫర్ డిసెంబర్ 31తో ముగియనుండటంతో ఈ సిమ్ ను ఎలాగైనా దక్కించుకోవాలని కష్టమర్లు డబ్బులు చెల్లించి మరీ కొంటున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

జియో స్పీడ్‌పై నమ్మలేని నిజాలు..ఎందుకిలా..?

వీరు జియో సిమ్‌కి 50 రూపాయల నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జియో వారి అనుభవాలను dna డైలీ న్యూస్ అండ్ ఎనాలసిస్ అనే వెబ్‌సైట్‌తో షేర్ చేసుకున్నారు. అవేంటో వారి మాటల్లోనే విందాం.

పడిలేచిన శాంసంగ్ : కళ్లు చెదిరే ఆఫర్లతో దిగ్గజాలకు షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ మొబైల్ స్టోర్ లో 250 రూపాయలు

ఘజియా బాద్ కు చెందిన దీపక్ వర్మ డీఎన్ఏ మనీతో మాట్లాడుతూ జియో సిమ్ కోసం అన్ని రిలయన్స్ షోరూంల్లో వెతికాను కాని ఎక్కడా సాధించలేకపోయాను. చివరకు ఓ మొబైల్ స్టోర్ లో దాన్ని తీసుకున్నానని దానికోసం 250 రూపాయలు చెల్లించానని చెప్పారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 250 పెట్టి సిమ్ కొన్నా

హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రాధా మిశ్రా మాట్లాడుతూ అదే మొబైల్ అవుట్ లెట్ లో నేను రూ. 250 పెట్టి సిమ్ కొన్నానని తెలిపారు. అక్టోబర్ 10న దీన్ని తీసుకున్నానని అయితే అది యాక్టివేట్ అయ్యేసరికి తల ప్రాణం తోకకు వచ్చిందని చెప్పారు. షోరూం వెంట ఎన్ని సార్లు తిరిగినా వారు టెక్నికల్ ప్రాబ్లం అంటూ చెప్పేవారని వాపోయారు.

రూ. 500

మీరట్ కు చెందిన విన్ని జైన్ రూ. 500 చెల్లించి జియో సిమ్ తీసుకున్నానని తెలిపారు. ముంబాయి ప్రాంతానికి చెందిన కళ్యాన్ అనే జర్నలిస్ట్ సైతం రూ. 50 చెల్లించి సిమ్ తీసుకున్నామని తెలిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు రూ. 7500

ఓ స్టోర్ కీపర్ దగ్గర తాను జియో సిమ్ తీసుకున్నానని అతను రోజుకు 150 సిమ్ లు అమ్మేవాడని ఇలా దాదాపు రోజుకు రూ. 7500 సంపాదించేవాడని తెలిపారు.

ఆధార్ కార్డుతో జియ్ సిమ్ ప్రీ

అయితే ఆధార్ కార్డుతో జియ్ సిమ్ ప్రీ అని చెప్పినప్పటికీ వీరు మాత్రం ఛార్జ్ చేసేవారని తెలిపారు. అయితే దీనిపై dna money's జియోని సంప్రదించగా ఇది మా దృష్టికి ఇది వచ్చిందని దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామని dna money'sకి తెలిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముఖేష్ అంబాని టార్గెట్

కాగా 16 మిలియన్ల మందికి జియో సిమ్ చేరాలని ముఖేష్ అంబాని టార్గెట్ పెట్టుకున్న విషయం విదితమే. అయితే దీన్ని 100 మిలియన్లకు చేర్చే విధంగా ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

dna డైలీ న్యూస్ అండ్ ఎనాలసిస్ అనే వెబ్ సైట్

ఈ సమాచారమంతా dna డైలీ న్యూస్ అండ్ ఎనాలసిస్ అనే వెబ్ సైట్ సేకరించింది. మరి ఈ విషయంపై రానున్న కాలంలో జియో ఎలా స్పందిస్తుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is RJio no longer dialling free? Users charged from Rs 50 to 500 for SIM card read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot