Home
News

ఒకే రాకెట్‌‌లో 83 శాటిలైట్‌లు, భారత్ సంచలనం!

ఒకే రాకెట్ లో 83 శాటిలైట్ లను ఉంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ఇస్రో భావిస్తోంది.

By Sivanjaneyulu Bommu

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అంతరిక్ష రంగంలో సరికొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. ఒకే రాకెట్‌లో 83 శాటిలైట్‌లను ఉంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం 2017 ఆరంభంలో ఉంటుంది.

ఒకే రాకెట్‌‌లో 83 శాటిలైట్‌లు, భారత్ సంచలనం

ఒకే రాకెట్ ద్వారా ఇస్రో ప్రవేశపెట్టబోయే 83 శాటిలైట్లలో రెండు భారత్‌కు చెందినవి కాగా, మిగిలన 81 శాటిలైట్లు వివిధ దేశాలకు చెందినవి అని ఇస్రో వాణిజ్య విభాగం యాంట్రిక్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శశిభూషణ్ తెలిపారు. PSLV-XL రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి తీసుకువెళ్లబోయే ఈ మొత్తం శాటిలైట్ల బరువు 1,600 కిలోల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఇస్రో ఒకే రాకెట్ పై 20 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించగలిగింది.

Read More : సంచలనం రేపుతోన్న Flipkart ఆఫర్లు

అంతరిక్షా పరిశోధనా రంగంలో..

అంతరిక్షా పరిశోధనా రంగంలో..

అంతరిక్షా పరిశోధనా రంగంలో ఇస్రోకి విజయాలు అలవాటైపోయాయి. అపజయాలను తరిమికొడుతూ ఇస్రో విక్టరీ సింబల్ ను ఎగరేసి ప్రపంచదేశాలను ముక్కునవేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఇస్రో మరో రికార్డు విక్టరీని సొంతం చేసుకుంది. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపి అన్నిదేశాలకు ఆశ్చర్యంతో పాటు షాక్ ను ఇచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో నింగిలోకి పంపిన 20 ఉపగ్రహాలపై స్పెషల్ ఫోకస్.

ఒకేసారి 20 ఉపగ్రహాలు..

ఒకేసారి 20 ఉపగ్రహాలు..

ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి ఇస్రో సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రాకెట్‌ ప్రయోగం తర్వాత నింగిలోకి ఉప గ్రహాలు ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పటింది.

శాటిలైట్లను పంపాలంటే ..

శాటిలైట్లను పంపాలంటే ..

అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపాలంటే ఇప్పుడు ప్రపంచదేశాలు ఇస్రో వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇస్రో నుంచి అంతరిక్షంలోకి ఏ ఉపగ్రహమైన గురి తప్పకుండా కక్ష్యలోకి చేరుకుంటుంది. అంత నమ్మకం ఉంది కాబట్టే విదేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. 1993 నుంచి ఇస్రోకి అన్ని విజయాలే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కార్టోశాట్ -2

కార్టోశాట్ -2

భూపరిశీలన కోసం రూపొందించిన కార్టోశాట్ -2 శాటిలైట్‌ను నింగిలోకి తీసుకెళ్లింది. ఇది డ్రాయింగ్ మ్యాప్ అప్లికేషన్ కోసం ఈ శాటిలైట్ ను ఉపయోగిస్తారు. అలాగే వాతావరణ పరిస్థితులు సముద్ర తీరంలోని పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ శాటిలైట్ పంపిస్తుంది.

మైక్రో శాటిలైట్స్..

మైక్రో శాటిలైట్స్..

అమెరికాకు చెందిన డవ్ అనే 12 మైక్రో శాటిలైట్స్, స్కైశాట్ జెన్ 2-1 అనే మరో శాటిలైట్‌, కెనడాకు చెందిన 2శాటిలైట్స్, జర్మనీకి చెందిన బైరోస్ శాటిలైట్, ఇండోనేషియాకు చెందిన లపన్-ఎ3 శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేరవేసింది.

స్కైజాట్ జెన్ 2-1

స్కైజాట్ జెన్ 2-1

దీన్నే స్కైజాట్ జెన్ 2-1 అనిపిలుస్తారు. ఇది గూగుల్ కంపెనీ అయిన తెర్రాబెల్లా తయారుచేసింది. స్కైశాట్ జెన్ -2 హైక్వాలిటీ వీడియోలను అంతరిక్షం నుంచి భూమికి పంపనుంది. ఇది దాదాపు 100 కేజీల బరువు ఉంది.

ప్లానెట్ ల్యాబ్..

ప్లానెట్ ల్యాబ్..

వీటితో పాటు 12డవ్ శాటిలైట్లు భూమిని పరిశోధించనున్నాయి. ఈ శాటిలైట్లు ఒక్కోటి 4.7 కేజీల బరువు ఉంటుంది. వీటిల్లో ప్లోక్ -2పీ శాటిలైట్ ను అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్ తయారుచేసింది. ఇవి భూమిని పరిశోధించే అతి పెద్ద ఉపగ్రహాల కూటమి.

స్టూడెంట్లు తయారుచేసిన శాటిలైట్ల

స్టూడెంట్లు తయారుచేసిన శాటిలైట్ల

స్టూడెంట్లు తయారుచేసిన రెండు శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపింది. అవి సత్యభామ అలాగే స్వయం. సత్యభామను చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు డెవలప్ చేయగా స్వయంను పుణే కాలేజి విద్యార్థులు డెవలప్ చేశారు. ఇవి భూ పరిశోధనను చేపట్టనున్నాయి.

మొత్తం శాటిలైట్ల బరువు దాదాపు 1288 కేజీలు

మొత్తం శాటిలైట్ల బరువు దాదాపు 1288 కేజీలు

ఇస్రో నింగిలోకి పంపిన మొత్తం శాటిలైట్ల బరువు దాదాపు 1288 కేజీలు.వీటిలో అత్యంత బరువైన శాటిలైట్ కార్టోశాట్ -2 దీని బరువు 727.5 కేజీలు. అలాగే అత్యంత చిన్న శాటిలైట్ స్వయం. దీని బరువు కేవలం ఒక కేజీ. సంచలనం రేపుతోన్న Flipkart ఆఫర్లు

 

ప్రపంచదేశాలకు చెందిన 57 శాటిలైట్లు..

ప్రపంచదేశాలకు చెందిన 57 శాటిలైట్లు..

ఇప్పటివరకు ప్రపంచదేశాలకు చెందిన 57 శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపింది. వీటిల్లో 20 దేశాలకు చెందిన శాటిలైట్లు ఉన్నాయి. అయితే వీటిని నింగిలోకి పంపడానికి ఇస్రో మిగతా స్పేస్ సెంటర్ల కన్నా 10 శాతం తక్కువే ఛార్జ్ చేస్తుంది. అది ఇండియా అంటే అని ప్రపంచదేశాలు పొగుడుతున్నాయి. సామ్‌సంగ్ పై సెటైర్ల లొల్లి..!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
ISRO gearing up for launch of 83 satellites on single rocket in 2017. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X