బాలీవుడ్‌‌లో తొలి సంచలనం

Written By:

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరోమారు తన లక్కీ క్వీన్ కాజోల్ తో నటించిన దిల్ వాల్ సినిమా డిసెంబర్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. బాలీవుడ్ లోనే తొలిసారిగా ఈ సినిమాలో ఓ పాటను 360 డిగ్రీ కెమెరా టెక్నాలజీతో షూట్ చేశారు. దీంతో ఈ సినిమా మీద అలాగే ఆ పాట మీద భారీగానే అంచనాలు పెరిగాయి. అదీకాక షారూఖ్ కాజోల్ సినిమాలు ఇంతకుముందు చాలా వరకు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు కూడాఅదే స్థాయిలో ఉన్నాయి.

Read more: గాల్లో తేలినట్లుందే..గుండె పేలినట్టుందే

బాలీవుడ్‌‌లో తొలి సంచలనం

ఈ సినిమాలోని జనంజనం అనే పాటను 360 డిగ్రీ కెమెరా టెక్నాలజీతో చిత్రీకరించడంతో తెగ ఆసక్తి నెలకొంది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో తెగ సంచలనం రేపుతోంది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హాయ్, కభి కుషి కభిగమ్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా నటించిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ లు మళ్ళీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'దిల్ వాలే'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

Read more: ఉద్యోగాలిస్తామంటున్న సైబర్ నేరగాళ్లు

ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో వరుణ్ ధావన్, కృతి సనన్ లు నటిస్తున్నారు.తాజాగా షారుఖ్ ఖాన్ ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది.

Read more about:
English summary
Here Write Watch Shah Rukh Khan’s ‘Janam Janam’ from Dilwale, the first bollywood song to be shot in 360 degrees
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot