Home
News

2 రూపాయలతో నెలంతా ఫ్రీ కాల్స్..జియోకి దడ పుట్టిస్తున్న బిఎస్ఎన్ఎల్

By Hazarath

జియో మీద వార్ ను డిక్లేర్ చేయడానికి అని టెల్కోలు కిందా మీదా పడుతుంటే BSNL మాత్రం కాచుకో నువ్వూ నేనా అంటూ ముందుకు దూసుకొచ్చింది. జియోకి దిమ్మతిరిగేలా సరికొత్త పాన్లతో వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఇప్పటి దాకా జియో అన్ని టెల్కోలకు షాక్ ఇస్తే ఇక నుంచి జియోకి BSNL షాక్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిసున్నాయి. మరి జియో ను తలదన్నే ఆఫర్ BSNL ఏం తీసుకువచ్చిందో ఓ సారి చూద్దాం.

జియోకి సవాల్ : ఐడియా దిమ్మ తిరిగే ఆఫర్

జియోపై BSNL వార్ డిక్లేర్

జియోపై BSNL వార్ డిక్లేర్

జియోపై BSNL వార్ డిక్లేర్ చేసింది. కొత్త ఏడాది నుంచి తాము కూడా ఉచిత వాయిస్ కాల్స్ అందించడమే కాకుండా తక్కువ టారిఫ్ లతో వినియోగదారులకు సేవలందిస్తామంటూ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

జియో దెబ్బకు అన్ని టెల్కోలు

జియో దెబ్బకు అన్ని టెల్కోలు

ఉచిత వాయిస్ కాల్స్ , తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్యాకేజ్ లు అంటూ మొబైల్ రంగంలోకి దూసుకొచ్చి ఇతర టెలికం సంస్థలకు అనూహ్యంగా రిలయన్స్ జియో షాకిచ్చిన విషయం తెలిసిందే. జియో దెబ్బకు అన్ని టెల్కోలు కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి.

కష్టమర్లను కాపాడుకునేందుకు

కష్టమర్లను కాపాడుకునేందుకు

తమ కష్టమర్లను కాపాడుకునేందుకు ఆయా సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ మాత్రం జియోకు ధీటుగా వస్తున్నానంటూ ప్రకటించేసింది.

లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్

లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్

లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తోంది. అంతేకాదు జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట.

వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు

వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు

మేం ప్రస్తుత మార్కెట్‌లో జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నాం. మేం కూడా వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు కొత్త కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తాం' అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు.

కేవలం రూ.2 నుంచి రూ.4

కేవలం రూ.2 నుంచి రూ.4

జియోకంటే తక్కువ రేట్‌కే ఈ ప్లాన్ అందించనున్నాం. ఇది కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చు' అని ఆయన చెప్పారు. కాగా కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో బీఎస్ఎన్ఎల్‌కు అతి పెద్ద మార్కెట్ ఉంది.

జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్

జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్

ఈ ప్రాంతాల్లో జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అందించనున్నట్లు ఈ ప్లాన్ లోకి ప్రవేశించేందుకు కూడా అతితక్కువ మొత్తంలోనే రుసుము వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149

జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149

ప్రస్తుతం జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149 చెల్లించాలి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రవేశ రుసుం రూ.2 నుంచి రూ.4మాత్రమే వసూలు చేస్తుందట.

అందరికీ ఈ ఫ్లాన్

అందరికీ ఈ ఫ్లాన్

బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదార్లతోపాటు ఇంటి వద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకుంటున్నవారికి కూడా ఈ ప్లాన్ అందిస్తామని శ్రీవాత్సవ చెప్పారు.

బీఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయంతో

బీఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయంతో

బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇక ఎయిర్ టెల్ ప్లస్, వోడాఫోన్, ఐడీయాలపై మరింత ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జియో ఆగమనం తర్వాత దానికి పోటీగా దూసుకొస్తున్న మరో టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ మారనుంది.

నెలంతా అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ కాల్స్‌

నెలంతా అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ కాల్స్‌

నెలంతా అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ కాల్స్‌తో BSNL బంపర్ బొనాంజా..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్

Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్

దుమ్ము రేపుతున్న Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్..ప్లాన్ గురించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

జియోతో పోటీకి రె‘ఢీ

జియోతో పోటీకి రె‘ఢీ

దూకుడు పెంచిన BSNL, జియోతో పోటీకి రె‘ఢీ'!..పోటీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

జియోకి కౌంటర్

జియోకి కౌంటర్

జియోకి కౌంటర్: BSNL 24 గంటలు ఫ్రీ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా..క్లిక్ చేయండి

 

 

రూపాయికే 1జీబి ఇంటర్నెట్,

రూపాయికే 1జీబి ఇంటర్నెట్,

More from GizBot

Best Mobiles in India

English summary
Jio impact: BSNL mulls zero-voice tariff plans for all internet users Read more gizbot telugu..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X