జియోకి సవాల్ : ఐడియా దిమ్మ తిరిగే ఆఫర్

Written By:

సంచలనాలతో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి షాకిచ్చేందుకు ఐడియా రెడీ అయింది. మిగతా టెలికం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జియోకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఐడియా ఆఫ్ లైన్ వీడియోస్ పేరుతో ఓ ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఉచిత కాల్స్ అతి తక్కువ ధరకు డేటా అంటూ ముఖేష్ చేసిన ప్రకటన కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిన నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ గట్టెక్కాలని చూస్తోంది. అందులో భాగంగా ఓ సరికొత్త యాప్ తో ముందుకొస్తోంది.

జియోలు ఎన్ని వచ్చినా నంబర్ వన్ మాదే: Airtel సంచలన వ్యాఖ్యలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్‌లో

ఈ ఆఫర్ ప్రకారం, ఐడియా వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా సినిమాలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మూవీ క్లబ్ యాప్‌‌ను

ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

బీటా వెర్షన్‌లో మాత్రమే

అయితే ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ఐడియా వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను చెక్ చేసుకోవచ్చని ఐడియా ప్రతినిధులు సూచించారు.

యూజర్లపై కొంత ఛార్జి

ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాక యూజర్లపై కొంత ఛార్జి విధించే అవకాశముందని తెలిసింది.

ఆటోలాగిన్ ఆప్షన్

ఆఫ్‌లైన్‌లో వీడియోలు, సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోనేందుకు ఆటోలాగిన్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో యూజర్లు తమకు నచ్చిన క్వాలిటీలో వీడియోలను ఎంపిక చేసుకోవచ్చు.

ఒకేసారి రెండు వీడియోలను

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే యూజర్లు ఒకేసారి రెండు వీడియోలను చూసేందుకు వీలుగా డ్యుయల్ స్క్రీన్ అందుబాటులో ఉండేలా ఈ యాప్ ను తెస్తోంది. అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio 4G effect: Idea Cellular's new app lets you download movies and videos to watch offline read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot