Home
News

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌... ఈ రెండు రీఛార్జ్‌ ప్లాన్‌లలో 20GB డేటాను అదనంగా పొందవచ్చు..!

భారతీయులు అధికంగా డేటాను వినియోగిస్తున్నారని ఇటీవల విడుదల అయిన నోకియా నివేదిక వెల్లడించింది. 5G విస్తరణ కారణంగా నెలవారీ సగటున 27.5GB డేటాను వినియోగిస్తున్నట్లు తెలిపింది. 5G మరింత అందుబాటులోకి వస్తే సగటు వినియోగం 50GB వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతోపాటు ఇటీవల EY ఇండియా మరో కీలక నివేదికను వెల్లడించింది. స్మా్ర్ట్‌ఫోన్ వినియోగంలో భారతీయులు డిజిటల్ ఇన్‌ఫెక్షన్‌ పాయింట్‌కు చేరుకున్నారని ఈ నివేదిక తెలిపింది.

2024 లో రోజుకు సగటున 5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో 70 శాతం సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌, గేమింగ్ కోసం కేటాయించినట్లు తెలిపింది. అధిక శాతం మంది యూజర్లు భారీగా డేటాను వినియోగిస్తున్నారు.

Jio Rs749  rs899 Prepaid recharge plans offers 20GB 4G additional data Telugu news

ఇలాంటి యూజర్ల కోసం జియో రెండు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లలో ఏకంగా 20GB డేటాను అధికంగా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు ఎక్కువ వ్యాలిడిటీని కూడా కలిగి ఉన్నాయి. జియో రూ.749, రూ.899 రీఛార్జ్ ప్లాన్‌లలో రోజువారీ అందిస్తున్న డేటాతోపాటు అదనంగా 20GB డేటాను అందిస్తోంది.

జియో రూ.749 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ జియో యూజర్లు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2GB 4G డేటాను అందిస్తోంది. మరియు అదనంగా 20GB డేటాను అందిస్తోంది.

దీంతోపాటు యూజర్లు 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే.. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. మొత్తంగా ఈ ప్లాన్‌లో 164GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు ఉచితంగా స్టోర్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో (Jio Rs749 Recharge Plan) భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతోపాటు ఇతర వీడియో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

రూ.899 రీఛార్జ్‌ ప్లాన్‌ :
జియో యూజర్లు ఈ ప్లాన్‌లో (Jio Rs899 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు మరో 20GB 4G డేటాను అదనంగా అందిస్తోంది.

ఈ ప్లాన్‌లో యూజర్లు అన్‌లిమిడెట్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 200GB 4G డేటాను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియోటీవీ, జియో AIక్లౌడ్‌ ద్వారా 50GB స్టోరేజీని పొందవచ్చు.

ప్రతిరోజు ఎక్కువ డేటాను వినియోగిస్తున్న యూజర్‌లకు ఈ రెండు ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు అందిస్తున్న డేటాతోపాటు అదనంగా 20GB ను వినియోగించుకోవచ్చు. మరియు 5G డేటా కూడా అదనం. ప్రస్తుతం IPL సీజన్‌ నడుస్తున్న నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా యూజర్లుకు ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

English summary
Jio Rs749, rs899 Prepaid recharge plans offers 20GB 4G additional data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X