Home
News

జియో కష్టమర్లకు అసలైన షాక్ ఇప్పుడిచ్చింది !

ఇప్పుడు కష్టమర్లకు జియో నిజంగానే అదిరిపోయే షాక్ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

By Hazarath

జియో.. జియో...దేశమంతా ఈ పదం మార్మోగిపోతోంది. ఉచిత ఆఫర్లతో టెల్కోలకు కంటిమీద కునుకులేకుండా చేసిన రిలయన్స్ జియో మార్చి నుంచి టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ యూజర్లు రూ. 99తో ఏడాది పాటు వాయిస్ కాల్స్ పొందవచ్చని డేటా కావాలంటే రూ. 303తో రీఛార్జ్ చేసుకోవాలని ముఖేష్ అంబాని ప్రకటించారు. అయితే ఇప్పుడు కష్టమర్లకు జియో నిజంగానే అదిరిపోయే షాక్ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు నుంచి వచ్చిన రూమర్లు చెబుతున్నాయి.

ప్రపంచంలో తొలి 4.5జీ స్మార్ట్‌ఫోన్, అమితవేగంతో డౌన్‌లోడ్

1000 కాల్స్ మాత్రమే

1000 కాల్స్ మాత్రమే

మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న రూమర్ల ప్రకారం జియో నుంచి నెలకు కేవలం 1000 కాల్స్ మాత్రమే చేసుకోవచ్చని అంటే రోజుకి 33 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చని సమాచారం.

ఎంత పెద్ద ప్లాన్ తీసుకున్నా

ఎంత పెద్ద ప్లాన్ తీసుకున్నా

మీరు జియోలో ఎంత పెద్ద ప్లాన్ తీసుకున్నా అందులో మీకు నెలకు కేవలం 1000 కాల్స్ మాత్రమే వస్తాయని, డేటా మాత్రమే మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంటర్ కనెక్ట్ ఇవ్వకపోవడంతో

ఇంటర్ కనెక్ట్ ఇవ్వకపోవడంతో

దిగ్గజ టెల్కోలు ఐడియా ,ఎయిర్‌టెల్ జియోకి ఇంటర్ కనెక్ట్ ఇవ్వకపోవడంతో దానికి ఛార్జీలు చెల్లించాల్సిందేనని చెప్పడంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టెలికం రంగం నుంచి వార్తలు వస్తున్నాయి.

జియో టూ జియో కాల్స్ మాత్రమే

జియో టూ జియో కాల్స్ మాత్రమే

1000 కాల్స్ పూర్తయిన తరువాత ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్ చేయాలంటే కొంతమొత్తంలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే రీఛార్జ్ లేకుండా జియో టూ జియో కాల్స్ మాత్రమే చేసుకోవచ్చని టెలికం వర్గాలు నుంచి అందిన సమాచారం. 

రూ. 149 ప్లాన్ లో మాత్రమే నెలకి 1000 కాల్స్

రూ. 149 ప్లాన్ లో మాత్రమే నెలకి 1000 కాల్స్

ఇందులో మరో రూమర్ కూడా వినిపిస్తోంది. రూ. 149 ప్లాన్ లో మాత్రమే నెలకి 1000 కాల్స్ ఇచ్చే దిశగా రిలయన్స్ ఆలోచిస్తుందని మిగతా ప్లాన్లలో అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుందని టెలికం వర్గాల నుంచి వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది.

జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.?

జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.?

జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.? మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio To Offer 1000 Free Mins/Month Only...Not Unlimited voice calls read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X