ప్రపంచంలో తొలి 4.5జీ స్మార్ట్‌ఫోన్, అమితవేగంతో డౌన్‌లోడ్

Written By:

ప్రముఖ చైనా టెలికం దిగ్గజం హువాయి ప్రపంచంలో మొట్టమొదటి 4.5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. హువాయి పీ 10 పేరుతో లాంచ్ చేసిన ఈ 4.5జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా రెట్టింపు వేగంతో డాటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్‌లో క్వాడ్ యాంటెనాతో కూడిన 4X4 మిమో టెక్నాలజీని పొందుపర్చినట్లు, ఈ ఫీచర్ సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పుడు కూడా 4జీ కాల్‌డ్రాప్స్‌ను 60 శాతం మేర తగ్గించగలదని హువావే కన్జ్యూమర్ గ్రూపు వ్యాపార సీఈవో రిచర్డ్ యూ తెలిపారు.

వివో నుంచి 3జిబి ర్యామ్ ఫోన్ రిలీజయింది

ప్రపంచంలో తొలి 4.5జీ స్మార్ట్‌ఫోన్, అమితవేగంతో డౌన్‌లోడ్

వచ్చేనెలలో అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఇండియాకు వచ్చేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టనుంది. దీని ధరను 649 యూరోలుగా నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీలో రూ. 45 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

మార్కెట్‌ని షేక్ చేయడానికి రెడ్‌మి నోట్ 4 బ్లాక్ వర్షన్ దూసుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యామ్

పీ 10 ఫోన్ 4జీబి ర్యామ్ అలాగే 64 జిబి ఇంటర్నల్ స్టోరజ్‌తో వస్తోంది. మైక్రో ఎస్ డీ ద్వారా 256 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యాన్ని కూడా కల్పిస్తోంది. మొతం 7 కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే డ్యూయెల్ రేర్ కెమెరాతో ఫోన్ వచ్చింది. బ్యాక్ 20 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 12 మెగా ఫిక్సల్ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీ అభిమానుల కోసం 8 ఎంపీ సెల్పీ కెమెరాను పొందుపరిచారు. 4కె వీడియో సపోర్టింగ్ తో పాటు 3D facial recognition కూడా ఉంది. 4-in-1 hybrid autofocus, hybrid zoom కూడా చేసుకోవచ్చు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికొస్తే 5.1 పుల్ హెచ్ డి డిస్ ప్లేతో పాటు 1080x1920 రిజల్యూషన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ మీద రన్ అవుతుంది. 4.5G LTE with 4x4 MIMO Technology for faster speeds. 02.11a/b/g/n/ac, Bluetooth 4.2, USB Type-C, GPS, and DLNAలాంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3200 mAh batteryని పొందుపరిచారు. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీని సొంతం. కేవలం 90 నిమిషాల్లో పుల్ చార్జింగ్ అవుతుంది. ముందుభాగంలో పింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు.

పీ10 ప్లస్

కంపెనీ పీ 10తో పాటు పీ 10 ప్లస్ ఫోన్ ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తోంది. 5.5 ఇంచ్ డిస్ ప్లేతో రానున్న ఈ ఫోన్ 3750mAh batteryని కలిగిఉంది. 4జిబి/6జిబి ర్యామ్, 64 జిబి/128 జిబి స్టోరేజ్ లో పీ 10 ప్లస్ ని రిలీజ్ చేస్తోంది.

ధర

పీ10 ధరను 649 యూరోలుగా నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీలో రూ. 45 వేల వరకు ఉండే అవకాశం ఉంది. పీ 10 ప్లస్ 699 యూరోలుగా నిర్ణయించారు. రూ. 49 వేల వరకు ఉండే అవకాశం ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei unveils world's 1st smartphone with 4.5G technology read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot