జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.?

Written By:

టెలికం రంగంలో కంటి మీద టెల్కోలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న రిలయన్స్ జియో ఇప్పుడు మళ్లీ సరికొత్త ప్లాన్లకు తెరలేపింది. ఈ సారి ట్యాక్సీ కంపెనీలను టార్గెట్ చేయడానికి రెడీ అయింది. ఈ మేరకు ఆటోమొబైల్స్ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. జియో క్యాబ్స్ గా వీటికి పేరు పెట్టనుంది కూడా సమాచారం.

టెలికం రంగంపై కాయ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో క్యాబ్స్‌

టెలికాం రంగంలో సంచలనాలు సష్టిస్తున్న జియో ఈ ఏడాది సొంత యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. రిలయన్స్ జియో క్యాబ్స్‌గా వీటిని నామకరణం చేయనుందట.

కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు ప్లాన్

ఏప్రిల్ ‌లోనే లాంచ్ చేద్దామనుకున్న ఈ సర్వీసులను మరికొన్ని నెలలు ఆలస్యంగా కమర్షియల్‌గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఫాక్టర్ డైలీ రిపోర్టులు పేర్కొంటున్నాయి.

600 కార్లను కూడా ఆర్డర్

ఈ సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే కంపెనీ మహింద్రా, హ్యుందాయ్ వంటి వాటితో సంప్రదింపులు చేస్తుందని తెలుస్తోంది. 600 కార్లను కూడా ఆర్డర్ చేసిందట.

తొలుత బెంగళూరు, చెన్నై

తొలుత బెంగళూరు, చెన్నైలో వీటిని ప్రారంభించి, అనంతరం ఈ సర్వీసులను ఢిల్లీ, ముంబాయిలకు విస్తరిస్తుందని ఫాక్టర్ డైలీ పేర్కొంది. అదేసమయంలో చిన్న మార్కెట్లలో కూడా తన సర్వీసులను ప్రారంభిస్తుందట.

ఉబెర్‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని..

జియో ఇటీవలనే టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో కష్టమర్లు ఇకపై ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులు జరుపుకునేలా ఈ భాగస్వామ్యం సహకరించనుంది.

ఖండించిన రిలయన్స్ వర్గాలు

అయితే ఈ వార్తలను రిలయన్స్ వర్గాలు ఖండించాయి. జియో నేరుగా స్పందించకపోయినప్పటికీ రిలయన్్ ఉద్యోగి ఒకరు ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

సంబంధంలేని రంగంలోకి

ఓలా, ఉబెర్‌ సంస్థలకు గట్టి పోటీనిచ్చేలా మరో సరికొత్త క్యాబ్‌ సర్వీస్‌ కంపెనీ త్వరలోనే జియో ప్రారంభించనుందన్న వార్తలపై స్పందించిన రిలయన్స్‌ ప్రతినిధి ఈ వార్తలు తప్పు అంటూ కొట్టి పారేశారు. మరోవైపు రిలయన్స్‌ జియో సంబంధంలేని రంగంలోకి అడుగుపెట్టే ఆలోచన ఏదీ లేదని రిలయన్స్‌ అధికారి ఒకరు వివరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio denies it will launch own app-based taxi service read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot