ఆండ్రాయిడ్ యూజర్స్ కొసం జియో టీవి కొత్త యాప్
కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది.
కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది.ఇప్పుడు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లకు మరొక శుభవార్తను అందించింది.

మూవీస్ ఎక్కువ చూసే వారి కొసం రిలయన్స్ జియో దాని జీయో TV యాప్ యొక్క అప్డేట్ వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్లో విడుదల చేసింది.

పిక్చర్ -ఇన్-పిక్చర్
దీనితో పిక్చర్ -ఇన్-పిక్చర్ (PiP) మద్దతు లభించింది. PiP మద్దతు అనేది ఎక్కువగా మీడియా యాప్ ల కోసం డిమాండ్ చేయబడిన లక్షణం దీని వలన వినియోగదారులు వారి Android స్మార్ట్ ఫోన్ లలో ఇతర పనుల మధ్యలో ఉన్నప్పుడు కూడా కంటెంట్ను చూడటానికి అనుమతిస్తుంది. JioTV లో పిక్చర్-ఇన్-పిక్చర్ మద్దతు Android 8.0 Oreo పై నడుస్తున్న పరికరాలకు మాత్రమే పరిమితమని Jio సూచించింది. అప్డేట్ వెర్షన్ Jio TV యాప్ ని Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

JioTV
మీ వీక్షణ అనుభవాన్ని తారా స్థాయికి తీసుకురావడానికి మేము మీకు పిక్చర్ -ఇన్-పిక్చర్ ఫీచర్ ని అందిస్తున్నాము" ఇప్పుడు మీరు మీ ఫోన్ లొ jio tv చూస్తూ కూడా చాట్ చేయవచ్చు , బ్రౌజ్ చేయవచ్చు అని JioTV బృందం అధికారిక చేంజ్లాగ్లో వ్రాసింది.

ఆండ్రాయిడ్
గూగుల్ ఆండ్రాయిడ్ 8.0 లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ కి మద్దతును పరిచయం చేసింది. ఇది ప్రత్యేక మల్టీ-విండో మోడ్ ఇది ఫోన్ లొ ఇతర పనులను చేస్తున్నప్పుడు వినియోగదారులు ఒక చిన్న విండోలో వీడియోని చూడటానికి అనుమతిస్తుంది.
అధికారిక Jio TV Android వెర్షన్ చేంజ్లాగ్ కొత్త వెర్షన్ లో పరిచయం చేసిన ఏ ఇతర కొత్త లక్షణాలను పేర్కొనలేదు.

పలు భాషల్లో కంటెంట్
జియో టీవీ రిలయన్స్ జియో నుండి ప్రత్యక్ష ప్రసార టీవీ అప్లికేషన్. టెలికాం ఆపరేటర్ల చందాదారులకు ఇది 600 కన్నా ఎక్కువ టీవీ చానెళ్లకు రియల్ టైమ్ ప్రాప్తిని అందిస్తుంది . అప్లికేషన్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాల్లో 7-రోజుల క్యాచ్ అప్ TV, రికార్డింగ్ మద్దతు మరియు పాజ్ మద్దతు ఉన్నాయి. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్పురి, పంజాబీ, మలయాళం, అస్సామీ, ఒడియ మరియు ఉర్దూ వంటి పలు భాషల్లో కంటెంట్ ని అందిస్తుంది.

రిలయన్స్ జీయో
Jio TV రిలయన్స్ జీయో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది మరియు ప్రస్తుతం Android మరియు iOS పరికరాల్లో పనిచేస్తుంది. త్వరలో డెస్క్టాప్ కంప్యూటర్ల కోసం మద్దతునిస్తామని సంస్థ వాగ్దానం చేసింది.


Click it and Unblock the Notifications