Home
News

క్రికెట్ అభిమానులకు జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా అపరిమిత స్ట్రీమింగ్, ఇంటర్నెట్.. మిస్ అవ్వకండి!

Jio Ultimate Cricket Bonanza: క్రికెట్ ప్రియులకు జియో అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2025 క్రికెట్ సీజన్‌ను మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. జియో సిమ్ ఉంటే చాలు కేవలం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే, క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఈ ఆఫర్‌లో 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ యాక్సెస్, 50 రోజుల పాటు జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్ ట్రయల్ కూడా ఉచితంగా పొందొచ్చు.

* ఈ ఆఫర్‌తో ప్రయోజనాలు..

90 రోజులు జియోహాట్‌స్టార్ ఉచితంగా చూడవచ్చు. ప్రతి క్రికెట్ మ్యాచ్‌ను టీవీ లేదా మొబైల్‌లో 4K క్వాలిటీతో ఫ్రీగా చూడవచ్చు అని కంపెనీనే తెలిపింది. 50 రోజులు ఫ్రీ జియోఫైబర్/ఎయిర్‌ఫైబర్ ట్రయల్ విషయానికి వస్తే, జియో మీకు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను ఉచితంగా ట్రై చేసే ఛాన్స్ ఇస్తోంది.

Jio Ultimate Cricket Bonanza Unlimited Streaming and Internet  Don   t Miss Out

దీని ద్వారా మీ ఇంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోతుంది. జియోఎయిర్‌ఫైబర్‌లో 800+ టీవీ ఛానెళ్లు, 11+ ఓటీటీ యాప్స్‌కి యాక్సెస్, అన్‌లిమిటెడ్ వై-ఫై ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలా అని ఆలోచిస్తున్నారు కదా, అయితే కింద పేర్కొన్న వివరాలను క్షుణ్ణంగా చదవండి.

* ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి..

మీరు మార్చి 17 నుంచి 2025, మార్చి 31 మధ్యలో రీఛార్జ్ చేసుకోవాలి లేదా కొత్త జియో సిమ్ తీసుకోవాలి. ఇప్పటికే జియో సిమ్ వాడుతున్న వాళ్లు రూ.299 (రోజుకి 1.5GB లేదా ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

కొత్త జియో సిమ్ తీసుకునే వాళ్లు కొత్త జియో సిమ్ కొని, రూ.299 (రోజుకి 1.5GB లేదా ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో యాక్టివేట్ చేసుకోండి. మార్చి 17 కంటే ముందే రీఛార్జ్ చేసుకున్నా పర్లేదు రూ.100 యాడ్-ఆన్ ప్యాక్ వేసుకుంటే ఈ ఆఫర్ మీ సొంతం.

* ఆఫర్ ఎప్పుడు మొదలవుతుంది, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 2025, మార్చి 22 నుంచి మొదలవుతుంది. అదే రోజు కదా మ్యాచ్‌లు కూడా స్టార్ట్ అయ్యేది. ఇది 90 రోజుల వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 6000860008 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ ఆఫర్ ను జియోఏఐక్లౌడ్ టెక్నాలజీతో అందించడం జరుగుతోంది.

* IPL 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మార్చి 22న స్టార్ట్ అవుతోంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (గత ఛాంపియన్స్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్స్‌తో తలపడుతుంది. మ్యాచ్ మాత్రం దుమ్ము రేపుద్ది. ఇంకాస్త సమాచారం కావాలంటే Jio.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి లేదా దగ్గరలోని జియో స్టోర్‌కి వెళ్లి అడగవచ్చు.

సపరేట్‌గా ఓటీటీ ప్లాన్ కోసం డబ్బు వృథా చేయకూడదు అనుకునే క్రికెట్ లవర్స్ కి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్ కు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు కాబట్టి త్వరపడటం మంచిది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio offers free Hotstar for 90 days and a 50-day JioFiber or AirFiber trial with Rs 299 recharge. Enjoy unlimited cricket streaming this season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X