Home
News

జియో బ్రాండ్‌బ్యాండ్ సర్వీసు చాలా లేటు బాసూ..

By Gizbot Bureau

దేశంలో టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో గత నెలలో జియో ఫైబర్ నెట్ గురించి అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆకట్టుకునే ఆఫర్లతో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల వివరాలను జియో అధినేత ముకేష్ అంబానీ జియో మీటింగ్ లో బయటకు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల జియో ఫైబర్ నెట్ ట్రయిల్స్ కూడా మొదలయ్యాయి.

జియో ప్రివ్యూ ఆఫర్

జియో ప్రివ్యూ ఆఫర్ కింద కంపెనీ కొన్ని బెనిఫిట్లను కూడా ప్రకటించింది. హై స్పీడ్ ఇంట్నర్నెట్ అత్యంత తక్కువ ధరలో ఈ ఫ్లాన్లు అందుబాటులో ఉన్నయి. దేశ వ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ మాత్రం చాలా స్లోగా నడుస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి.

బుకింగ్ తర్వాత..

బుకింగ్ తర్వాత..

లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం జియో ఫైబర్ నెట్ కనెక్షన్ కోసం బుకింగ్ చేసుకునే వినియోగదారులు చాలా రోజుల దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదానికి చాలా సమయమే పట్టవచ్చు. మీరు బుకింగ్ చేసుకున్న తరువాత జరిగే ప్రాసెస్ చాలా లేటని రిపోర్టులు చెబుతున్నాయి.

ఎదురుచూపులే.

ఎదురుచూపులే.

జియో ఫైబర్ నెట్ కోసం ముందుగా జియో వెబ్ సైట్లో మీ రిజిస్టర్ ఐడీ ద్వారా బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధి కాల్ కోసం ఎదురుచూడాలి. అతను కాల్ చేసిన తరువాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జియో ప్రతినిధి ఎప్పుడు కాల్ చేస్తాడో తెలియదు. దానికి చాలా సమయం పట్టవచ్చు. అయితే దీనిపై జియో ఇంకా అధికారికంగా స్పందించలేదు. రిపోర్టులు మాత్రమే ఇలా చెబుతున్నాయి.

కస్టమర్ల ఫిర్యాదు

కస్టమర్ల ఫిర్యాదు

టెలికాం టాక్ రిపోర్ట్ ప్రకారం బుకింగ్ చేసుకున్న వాళ్లకి కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి కాల్ రాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. జియో ప్రివ్యూ ఆఫర్ బుక్ చేసుకున్న వారికి కంపెనీ ప్రతినిధులు కాల్ చేయడం లేదని వాపోతున్నారని రిపోర్ట్ చేసింది. కాగా కస్టమర్లు రూ. 2500 సెక్యూరిటీ డిపాజిట్ కింద కనెక్షన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.

జియో సెటప్ బాక్స్

జియో సెటప్ బాక్స్

కాగా జియో పివ్యూ ఆఫర్ యూజర్లకి కంపెనీ సెటప్ బాక్స్ ఆఫర్ చేయడం లేదని తెలుస్తోంది. కాగా రెగ్యులర్ బిల్లింగ్ కస్టమర్లకు జియో సెటప్ బాక్స్ ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జియో డీటీహెచ్ సర్వీసులు కూడా దీని ద్వారా అందుాబాటులో ఉన్నాయి. 450 ఛానల్స్ వరకు వీక్షించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
jiofiber Broadband Service Rollout Status Preview Offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X