Home
News

Jiophone బంపర్ ఆఫర్!! దీనిని ఎంచుకుంటే ఉచితంగా జియోఫోన్ పొందే అవకాశం

రిలయన్స్ జియో టెలికాం సంస్థ 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులను 4G ఫోన్ వినియోగదారులుగా మార్చడం కోసం ఇటీవలి సంవత్సరాలలో ప్రారంభించిన వినూత్న ఉత్పత్తులలో జియోఫోన్ ఒకటి. దీనిని ఇప్పటికే వాడుతున్న మరియు కొత్త జియోఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా కొన్ని ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. జియోఫోన్ భారతదేశంలో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు పరివర్తన యొక్క యుగాన్ని తెచ్చిపెట్టింది.

జియోఫోన్ ఉచిత ఆఫర్

టెల్కో 100 మిలియన్లకు పైగా వినియోగదారులను జియోఫోన్ ప్లాట్‌ఫామ్‌లోకి విజయవంతంగా అప్‌గ్రేడ్ చేసింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ జియో 'జియోఫోన్ 2021' ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత వినియోగదారులు మొత్తం 12 నెలల వాలిడిటీలో అన్ని రకాల సేవలను కేవలం రూ.749లకే పొందవచ్చు. ‘2G-ముక్ భరత్' పేరుతో లభించే కొత్త ఆఫర్‌లలో భాగంగా కొత్త జియోఫోన్ వినియోగదారులు రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం పాటు అన్ని రకాల సేవలను రూ.1,999 లేదా రూ.1,499 ధరల వద్ద పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫోన్ 2021 ఆఫర్

జియోఫోన్ 2021 ఆఫర్

రిలయన్స్ జియో సాధారణంగా ప్రస్తుత వినియోగదారులకు క్రొత్త ఆఫర్‌ ప్రయోజనాలను అందివ్వదు. అయితే ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులను నిలుపుకోవడానికి కొత్త వారితో సమానంగా ప్రయోజనాలను అందిస్తున్నది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు అపరిమిత కాలింగ్ ను ఆస్వాదిస్తున్న సమయంలో ప్రస్తుత ఫీచర్ ఫోన్ వినియోగదారులు వాయిస్ కాల్ ల కోసం అధిక ఛార్జీలను భరించవలసి వస్తున్నది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ మరియు Vi కస్టమర్లు తమ యొక్క కనెక్షన్‌ను చురుకుగా ఉంచడానికి మరియు ప్రాథమిక టెలికం సేవలను పొందడానికి ప్రతి నెలా రూ .45 నుండి రూ.50 కనీస ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి జియో సంస్థ కొత్తగా జియోఫోన్ ఆఫర్‌ను విడుదల చేసింది.

జియోఫోన్ 2021 ఆఫర్: 24 నెలల వాలిడిటీతో ఉచిత జియోఫోన్ ఆఫర్

జియోఫోన్ 2021 ఆఫర్: 24 నెలల వాలిడిటీతో ఉచిత జియోఫోన్ ఆఫర్

జియో టెలికాం సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన ‘జియోఫోన్ 2021‘ ఆఫర్‌లో కొత్త కనెక్షన్ ను తీసుకునేటప్పుడు జియోఫోన్ వినియోగదారులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మొదటి ఆప్షన్ రూ.1,999 ధర వద్ద లభించే ఆఫర్‌ను ఎంచుకోవడం. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు జియోఫోన్ మరియు 24 నెలల పాటు ఉచిత సేవలు లభిస్తాయి. మొత్తం 24 నెలల వాలిడిటీలో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ప్రతి నెలా 2GB హై-స్పీడ్ వద్ద క్యాప్ చేయబడిన అపరిమిత డేటాను వినియోగించవచ్చు. దీని తరువాత డేటా స్పీడ్ 64 Kbps కు తగ్గించబడుతుంది. అయితే SMS ల ప్రయోజనం గురించి ప్రస్తావించలేదు. దీనిని ఎంచుకున్న వినియోగదారులు రెండేళ్లపాటు రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదని సంస్థ పేర్కొంది.

జియోఫోన్ 2021 ఆఫర్: 12 నెలల వాలిడిటీతో ఉచిత జియోఫోన్ ఆఫర్

జియోఫోన్ 2021 ఆఫర్: 12 నెలల వాలిడిటీతో ఉచిత జియోఫోన్ ఆఫర్

జియోఫోన్ 2021 ఆఫర్‌లో భాగంగా రెండవ ఆప్షన్ 1,499 రూపాయల ధర వద్ద లభిస్తుంది. దీనిని ఎంచుకున్న వారు ఉచిత జియోఫోన్ తో పాటు 12 నెలల వాలిడిటీతో అపరిమిత కాల్స్ ప్రయోజనాల సేవలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలలో ప్రతి నెలా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న జియోఫోన్ యూజర్లు కేవలం రూ.749 చెల్లించి 12 నెలల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. జియోఫోన్ 2021 ఆఫర్ మార్చి 1 నుండి అన్ని రిలయన్స్ రిటైల్ మరియు జియో రిటైలర్లలో అమల్లోకి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
JioPhone 2021 Bumper Offer! Customers Will Get 12 Months Service and Free Jiophone at Just Rs 1499
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X