లెనోవో ఏ7000 ప్లస్ విడుదల

Posted By:

A7000 మోడల్‌కు సక్సెసర్ వర్షన్‌గా A7000 Plus స్మార్ట్‌ఫోన్ లెనోవో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఫిలిప్పిన్ మార్కెట్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. అక్కడి ధర PHP 7,999 (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.11,350). ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Read More : మతి పోగొడుతున్న శ్యాంసంగ్ డిస్కౌంట్లు

ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్ ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 64 బిట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీకే ఎంటీ6752 చిప్ సెట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : మోటో ఎక్స్‌ప్లే‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

లెనోవో ఏ7000 స్పెక్స్ ....

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో ఆవిష్కరించిన లెనోవో వైబ్ ఎస్1 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ కెమెరా ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ముందు భాగంలో రెండు ఫ్రంట్ ఫేసింగ్ (8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్) కెమెరాలను ఏర్పాటు చేయటం విశేషం. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో రెండు శక్తివంతమైన వైబ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో ఈ ఫోన్‌లు వస్తున్నాయి. వైబ్ పీ1 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, వైబ్ పీ1ఎమ్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

 ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో రెండు సరికొత్త ఫాబ్లెట్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు డివైస్‌లు 6.8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‍‌ప్లేలను కలిగి ఉంటాయి. ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ డివైస్‌లలో నిక్షిప్తం చేసారు.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో తన యోగా సిరీస్ నుంచి రెండు టాబ్లెట్ లను విడుదల చేసింది. వీటి పేర్లు యోగా టాబ్ 3 ప్రో, యోటా టాబ్ 3. 70 అంగుళాల ఇన్-బుల్ట్ ప్రొజెక్టర్‌తో ఇవి లభ్యమవుతున్నాయి.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో తాను ఇటీవల కొనుగోలు చేసిన మోటరోలా నుంచి మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ప్రదర్శించింది. కొత్త జనరేషన్ మోటో 360 స్మార్ట్‌వాచ్‌లు రెండు సైజుల్లో (46ఎమ్ఎమ్, 42ఎమ్ఎమ్) అందుబాటులో ఉంటాయి.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

 ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో ఐడియాప్యాడ్ 100ఎస్ పేరుతో నోట్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ ల్యాపీ రెండు (11.6, 14 అంగుళాల) వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 11.6 అంగుళాల మోడల్ ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తోనూ, 14 అంగుళాల మోడల్ డ్యుయల్ కోర్ సెలిరాన్ ఎన్3050 ప్రాసెసర్ తోనూ లభ్యమవుతాయి.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో క్రోమ్‌బుక్ 100ఎస్‌ను ప్రదర్శించింది. 11.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వచ్చే ఈ క్రోమ్‌బుక్ 2.6లాబ్స్ బరువును కలిగి ఉంటుంది. ఇంటెల్ బేట్రెయిల్-ఎమ్ ప్రాసెసర్‌ను డివైస్‌లో ఇన్-బుల్ట్ చేసారు.

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

 ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో థింక్‌ప్యాడ్ యోగా 260, 460 వేరియంట్ లలో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. యోగా 260 వేరియంట్ 12 అంగుళాల డిస్‌ప్లేతోనూ, 14 అంగుళాల వేరియంట్ 14 అంగుళాల డిస్‌ప్లేతోనూ లభ్యమవుతాయి. లెనోవో థింక్‌ప్యాడ్ యోగా 460 మోడ్రన్ డే యూజర్లతో పాటు గ్రాఫిక్ డిజైనర్‌లకు ఈ ల్యాప్‌టాప్ మరింతగా ఉపయోగపడుతుంది.

 

లెనోవో కొత్త ప్రొడక్ట్స్@ఐఎఫ్ఏ2015

ఐఎఫ్ఏ 2015ను పురస్కరించుకుని లెనోవో ఆవిష్కరించిన ఐడియాప్యాడ్ మిక్స్ 700 టాబ్లెట్, మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో టాబ్లెట్‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలిచింది. 12 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ టాబ్లెట్ 6వ తరం ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్‌తో పాటు ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్‌ను కలిగి ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo A7000 Plus launched, sports 5.5-Inch display, 4G LTE. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot