ఇండియాలో ప్రారంభించిన లెనోవా టాబ్ V7: ధర, ఫీచర్స్
లెనోవా సంస్థ ఇండియాలో కొత్త 6.9 అంగుళాల లెనోవా టాబ్ V7 టాబ్లెట్ డివైస్ ను విడుదల చేసింది. లెనోవా సంస్థ ఈ పరికరాన్ని వ్యాపారులతో పాటు విద్యార్థులు మరియు నిపుణుల కోసం లక్ష్యంగా పెట్టుకుంది. లెనోవా టాబ్ V7 ప్రభుత్వ మరియు సంస్థల కోసం ఐరిస్ గుర్తింపు సాంకేతికతతో కూడిన ప్రత్యేక వేరియంట్లో కూడా లభిస్తుంది.

లెనోవా టాబ్ V7 ను ఈ ఏడాది ప్రారంభంలో MWC సమయంలో ఆవిష్కరించారు.దీనిని ఇప్పుడు భారతదేశ వినియోగదారుల కోసం ఇండియాలో విడుదల చేశారు. టాబ్ V7 తప్పనిసరిగా లెనోవా యొక్క "టాబ్లెట్-మరియు-స్మార్ట్‌ఫోన్-ఇన్-వన్" భావజాలాన్ని అవలంబించే ఫాబ్లెట్. ఈ టాబ్లెట్ మిడ్-రేంజ్ స్పెక్స్‌తో వస్తుంది మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా వచ్చే నెలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇండియాలో లెనోవా టాబ్ V7 ధర మరియు లభ్యత:
లెనోవా టాబ్ V7 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతుంది. అవి 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్, మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్. వీటి యొక్క ధరలు వరుసగా 12,990 రూపాయలు మరియు 14,990 రూపాయలు. ఈ టాబ్లెట్లు కేవలం ఒకే ఒక కలర్ స్లేట్ బ్లాక్ కలర్ ఎంపికలో మాత్రమే అందించబడుతుంది. ఇది ఆగస్టు 1 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారానే కాకుండా అమెజాన్.ఇన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ సహా ఇతర రిటైల్ అవుట్లెట్ల ద్వారా కూడా త్వరలో ఈ టాబ్లెట్ను స్టాక్లో ఉంచనున్నాయి.

స్పెసిఫికేషన్స్:
లెనోవా టాబ్ V7 యొక్క ఎగువ మరియు దిగువ బెజెల్స్ టాబ్ బిట్ చంకీ అయితే, సైడ్ బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. ఈ టాబ్లెట్ 6.9-అంగుళాల ఎల్‌సిడి స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1080 × 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్, 18: 9 కారక నిష్పత్తి మరియు 350 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ డివైస్ ముందు భాగంలో సుమారు 81 శాతం కవర్ చేస్తుంది. డెల్బీ ఆడియో ట్యూనింగ్‌తో వచ్చే రెండు ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లను అందించడానికి లెనోవా మిగిలిన స్థలాన్ని ఉపయోగించింది. స్టాండర్డ్ స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దది కానందున దీనికి వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తోంది. దీనిని సులభంగా ఒకే చేతి పట్టుతో వాడవచ్చు.

ఫీచర్స్:
లెనోవా టాబ్ V7 అతి శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 450 SoC మరియు 3GB / 4GB RAM మరియు 32GB / 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 128GB వరకు అదనపు మెమొరీ కోసం మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరణను అందిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కోసం ఫోన్ డిఫాల్ట్‌గా Android 9.0 పై రన్ అవుతుంది. లెనోవా ఈ టాబ్లెట్‌లో రెండు కెమెరా యూనిట్లను కూడా అందిస్తోంది. ముందు భాగంలో సెల్ఫీస్ కోసం 5MP ఫిక్స్‌డ్ ఫోకస్ సెల్ఫీ షూటర్ ఉండగా, వెనుక భాగంలో 13MP ఆటో ఫోకస్ కెమెరా ఉంది. కెమెరా యాప్ HDR, పనోరమా, నైట్ షాట్, పోర్ట్రెయిట్ తోపాటు మరిన్ని వివిధ ఇమేజింగ్ మోడ్‌లను అందిస్తుంది. టాబ్ V7 స్మార్ట్‌ఫోన్ లాగా ఉంటుంది కానీ స్మార్ట్‌ఫోన్ కంటే కాస్త పెద్దది.

కనెక్టివిటీ :
కనెక్టివిటీ పరంగా లెనోవా టాబ్V7 4G VoLTE మద్దతుతో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌లను అందిస్తుంది. అదనంగా Wi-Fi 802.11 a / b / g / n / ac, బ్లూటూత్ 4.2, A-GPS మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి. ఇంత పెద్ద కాంట్రాప్షన్ గంటల తరబడి నడుస్తూ ఉండటానికి లెనోవా టాబ్V7 5180 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది 30 గంటల టాక్ టైం మరియు 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ మరియు బ్రౌజింగ్ అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లో వేగంగా ఛార్జింగ్ మద్దతు లేనప్పటికీ లెనోవా దానిని USB టైప్-సి పోర్ట్‌తో సన్నద్ధం చేయగలిగింది.


Click it and Unblock the Notifications








