భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

Posted By:

మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా' నినాదానికి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే టాప్ బ్రాండ్స్ జాబితాలో ఉన్న ప్రముఖ కంపెనీలు భారత్‌లో తయరీ ప్లాంట్‌లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా.. తాజాగా లెనోవో, మోటరోలాలు ఫ్లెక్స్‌ట్రానిక్స్ భాగస్వామ్యంతో చెన్నైలో ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసి ఫోన్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలను ముమ్మరం చేసాయి.

Read More : వ్యామోహం.. నిద్రలోనే దారుణం

ఈ ప్లాంట్ ప్రారంభమైతే మోటరోలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘మోటో ఇ'తో పాటు లెనోవో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్ ‘లెనోవో కే3 నోట్' కూడా ఇక్కడే తయారువుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 60 లక్షల హ్యాండ్‌సెట్‌‌లను భారత్‌లో తయారు చేయాలని లెనోవో భావిస్తున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

మోటరోలా బడ్జట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ’ ఇక పై భారత్‌లోనే తయారయ్యే అవకాశం.

 

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

లెనోవో సెక్సెస్‌ఫుల్ 4జీ స్మార్ట్‌ఫోన్ మోడల్ లెనోవో కే3 నోట్‌ను సైతం భారత్ లోనే తయారు చేసే అవకాశం.

 

 

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

అసుస్ తన స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారుచేసేందుకు పలు కాంట్రాక్ట్ సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది.  

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

ఫాక్స్‌కాన్ సంస్థ సహకారంతో షియోమీ ఇప్పటికే ‘రెడ్మీ 2 ప్రైమ్’ ఫోన్ ను భారత్‌లో తయారు చేసి మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.   

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలిచిన దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్, భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

సామ్‌సంగ్ బాటలోనే హెచ్‌టీసీ కూడా ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుకు తన మద్దతను ప్రకటించింది. 

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ సైతం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు మద్దతుగా నిలవటం విశేషం. 

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ టీవీలను భారత్‌లో తయారుచేసేందుకు ఫాక్స్ కాన్ కంపెనీతో సోనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.  

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

మైక్రోసాఫ్ట్ తమ లుమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేసేందుకు ఫాక్స్‌కాన్ సంస్థతో సంప్రదింపుల్లో ఉన్నట్లు సమచారం.  

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

చైనా మార్కెట్లో సంచలనం రేపుతోన్న మొబైల్ ఫోన్ కంపెనీ ఒప్పో సైతం మేన్ ఇన్ ఇండియాకు తన మద్దతను ప్రకటించింది. 

భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్’

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హువావీ, భారత్ లో స్మార్ట్ ఫోన్ లను తయారు చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు సమాచారం.  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోకి కొద్ది సంవత్సరాల క్రితమే అడుగుపెట్టిన లెనోవో ఇండియన్ యూజర్లకు కొత్తేమి కాదు. గత కొద్ది సంవత్సరాలుగా లెనోవో అందిస్తోన్న వ్యక్తిగత కంప్యూటర్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. దానికి తోడు లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో క్లిక్ అవటంతో రానున్న రోజుల్లో లెనోవో భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Read More : సత్యం...శివం...సుందరం

సాంకేతికంగా యువ భారత్ ను మరింత అభివృద్థి చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆచరణలోకి తీసుకు వచ్చిన మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ఇప్పటికే సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ, మైక్రోసాఫ్ట్, అసుస్, షియోమీ, జియోనీ, హువావీ, ఒప్పో తదితర అంతర్జాతీయ కంపెనీలు తమ మద్దతను ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Lenovo and Motorola start manufacturing smartphones in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot