ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు

Posted By:

ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు

త్వరలో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను అందిచనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ గురువారం కొత్తఢిల్లీలో వెల్లడించారు. తాజ్ మహల్, సౌరనాథ్, బుద్దగయ వంటి ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వారణాసి ఘాట్ వద్ద ఇప్పటికే ఉచిత వై-ఫై సేవలను అందిస్తున్నట్లు మంత్రి గుర్తు చేసారు. పర్యాటకులకు ఈ-వీసాలను జారీ చేసే ప్రక్రయను కూడా ప్రభుత్తం ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.

(చదవండి: యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా..?)

ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు

టైర్ 2, టైర్ 3 పట్టణాలను ఐటీ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ మంత్రిత్వ శాఖ బృహత్తర ప్రణాళికను సిద్థం చేసినట్లు మంత్రి వెల్లడించారు. తమ కొత్త పాలసీకి సంబంధించి మొదటి ఫేజ్‌లో భాగంగా చిన్నచిన్న పట్టణాల్లో కాల్ సెంటర్‌లతో పాటు బీపీఓలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా 48,000 మంది ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇ-కామర్స్ రంగం మరింత అభివృద్థి చెందిన నేపథ్యంలో పోస్టల్ శాఖ ద్వారా చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలకు సరుకులను రవాణా చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

(చదవండి: మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే)

ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు

భారత్‌లో మొబైల్ చందదారుల సంఖ్య తర్వలో 100 కోట్లకు చేరుతుందని, మరో రెండు సంవత్సరాల కాలంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగే అవకాశముందని మంత్రి రవిశంకర ప్రసాద్ స్పష్టం చేసారు.

(చదవండి: ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000 ప్లస్)

English summary
Major Tourist Spots to Get Free Wi-Fi Facility Soon: Telecom Minister. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting