మేకిన్ తెలంగాణా తొలి ట్యాబ్లెట్ సెల్‌కాన్‌దే

Written By:

మేకిన్ తెలంగాణా లో భాగంగా తొలి ట్యాబ్లెట్ పీసీ రిలీజయింది. తెలంగాణా ఐటీ,పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ మేకిన్ తెలంగాణాలో భాగంగా సెల్‌కాన్‌ కంపెనీ తయారుచేసిన ట్యాబ్లెట్ పీసీని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ..సెల్ కాన్ కంపెనీ తక్కువ సమయంలో పది లక్షల ఫోన్లు తయారు చేయడం అభినందనీయమని అన్నారు.

Read more: పెద్ద దేశాలకు పేద దేశాల సవాల్

మేకిన్ తెలంగాణా తొలి ట్యాబ్లెట్ సెల్‌కాన్‌దే

హైదరాబాద్ లో మొబైల్ రీసెర్చ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని కేటిఆర్ ఉన్నారు. త్వరలో హైదరాబాద్ లో టీ-హబ్ తరహా మొబైల్ హబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మైక్రోమ్యాక్స్, సేల్కాన్ కంపెనీలు ఇప్పటికే తమ ప్లాంట్లను ఏర్పాటు చేసాయి.

Read more : సైబర్ కోరల్లో భారత కంపెనీలు విలవిల

మేకిన్ తెలంగాణా తొలి ట్యాబ్లెట్ సెల్‌కాన్‌దే

తెలంగాణాలో మరిన్ని మొబైల్ ప్లాంట్స్, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేటిఆర్ అన్నారు. హైదారాబాద్ ను కేవలం తెలంగాణాకి మాత్రమే కాకుండా దేశానికే కాపిటల్ సిటీ అనే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

మేకిన్ తెలంగాణా తొలి ట్యాబ్లెట్ సెల్‌కాన్‌దే

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఔటర్ రింగురోడ్డు, తదితర ప్రాంతాల్లో కొత్త నగరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని..దీంతో తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని కేటిఆర్ అన్నారు.

Read more about:
English summary
make in telangana celkon launched first tablet in hyderabad
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting