ఆ రోబోట్ ఆ టైపా!!

Posted By:

ఎన్‌టిటి డొకోమో ఇంకా జపనీస్ టాయ్ మేకర్ టామీ సంయుక్తంగా అభివృద్థి చేసిన ‘ఓహానాస్'(OHaNAS) రోబోట్ ఆసక్తికర ఫీచర్లతో అలరిస్తోంది. బంతి షేపులో ఉండే ఈ వాయిస్ ఇంటరాక్టివ్  రోబోట్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వ్యక్తిగత సమాచారం, భోజనం సలహాలు, వాతావరణ సమాచారంతో పాటు మీ అదృష్టాన్ని కూడా తెలుసుకోవచ్చు.

(చదవండి: టాప్ 10 ఇంజినీరింగ్ కళాశాలలు (వరల్డ్ వైడ్))
మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం.

(చదవండి: సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు)

English summary
Meet OHaNAS, a robot that can connect with smartphone by Bluetooth.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot