ఫేస్‌బుక్ ఆఫీసులో మగధీరుడి ముచ్చట్లు

Posted By:

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పూర్తిగా బిజినెస్‌మైండ్ కలిగిన యువ హీరోల గురించి ఆరా తీస్తే ముందుగా బయటకు వచ్చే పేరు రామ్ చరణ్. ఓ వైపు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతూనే.. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మెల్లగా విస్తరించుకుంటుపోతున్నారు. ఈ కోవలో ఇప్పటికే మూడు రంగాల్లో అడుగుపెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇక ఈయన భార్య ఉపాసన కూడా బిజినెస్ ప్రొఫెషనల్.

Read more : తన చావును తనే కొని తెచ్చుకుంటోంది

ఫేస్‌బుక్ ఆఫీసులో మగధీరుడి ముచ్చట్లు

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో షికార్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని చరణ్ సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా చరణ్ వెల్లడించాడు. అంతేకాకుండా అక్కడి ఉద్యోగులతో కలసి దిగిన ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు. తనకు బహుమతులు ఇచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Read more: టైటాన్‌‌ను మంచు మేఘాలు కప్పేశాయి

ఫేస్‌బుక్ ఆఫీసులో మగధీరుడి ముచ్చట్లు

అయితే, ఫేస్‌బుక్ కార్యాలయంలో చెర్రీ తన భార్యతో కలిసి వెళ్లడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి బ్రూస్ లీ' రిజల్ట్తో కాస్త నిరుత్సాహపడిన రామ్ చరణ్, ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాల నుంచి తిరిగి రాగానే చరణ్ తమిళ సినిమా తనీఒరువన్ రీమేక్గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

ఫేస్‌బుక్ ఆఫీసులో మగధీరుడి ముచ్చట్లు

ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. బ్రూస్ లీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన డివివి దానయ్య మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నాడు.

Read more about:
English summary
Here Write Ram Charan Tej at Facebook office
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting