జియో సినిమా యాప్ సపోర్ట్ తో Mi టీవీలు
స్మార్ట్ ఫోన్ రంగంలో తనకంటు ఒక ప్రతేకత తెచ్చుకున్న తరువాత టీవీ రంగంలోకి ప్రవేసించిన షియోమి ఇక్కడ కూడా తనకంటూ ఒక ప్రతేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రముఖ చైనా టీవీ తయారీ సంస్థ షియోమి తన గుర్తింపు కోసం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ట్వీట్‌లో ప్రముఖ OTT బ్రాండ్ యాప్ JioCinemaను తన టీవీ సిరీస్ లలో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

షియోమి తన Mi టివి సిరీస్‌లో ఈ కొత్త అప్లికేషన్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించడానికి ట్విట్టర్‌లోకి వెళ్లింది. ఒక చిన్న వీడియో టీజర్ ను రిలీజ్ చేసిన చైనా టీవీ తయారీదారు షియోమి ఇప్పుడు తమ ప్రేక్షకులు తమ యొక్క పెద్ద స్క్రీన్‌లలో జియో సినిమాకు యాక్సిస్ పొందుతారని తెలియజేసారు.

Mi టివి వివరాలు :
షియోమి మార్కెట్లో తన పట్టును పెంచుకోగలిగిన ఏకైక పరిశ్రమ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదని గుర్తించింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెండు సంవత్సరాల క్రితం తన ప్రసిద్ధ Mi టివిలను భారతదేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి భారతీయ కొనుగోలుదారులు Mi టివిలను చాలా యూనిట్లు కొనుగోలు చేశారు. సరసమైన ధరల శ్రేణిలో Mi తన వినియోగదారులకు గొప్ప ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ తో Mi టివిలు ఇండియాలో చాలా బాగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో మరియు ప్యాచ్‌వాల్ UIతో వచ్చే Mi టివిలు భారతదేశంలో పెద్ద విజయాన్ని సాధించాయి. ఓవర్-ది-టాప్ ఫ్రంట్‌లో పెరుగుతున్న దృశ్యంతో ఎక్కువ మంది వినియోగదారులు ఆన్-డిమాండ్ కంటెంట్‌ను వినియోగిస్తున్నారు.

Mi టివిలో జియో సినిమా యాప్ వివరాలు :
జియో సినిమా అప్లికేషన్‌తో టివి షోలు లేదా సినిమాలు అన్ని ఒకే పేరుతో OTT కంటెంట్‌ను తీసుకురావడంలో రిలయన్స్ జియో ప్రత్యేకంగా పని చేసింది. రిలయన్స్ జియో లైవ్ టివి కోసం జియో టివి యాప్‌ను అందిస్తుండగా జియో సినిమా యాప్ అంటే చందాదారులు ఆన్-డిమాండ్ కంటెంట్‌ను చూడవచ్చు. ఇప్పుడు రిలయన్స్ జియో చందాదారులు తమ Mi టివి యొక్క పెద్ద స్క్రీన్‌లలో కంటెంట్‌పై ఈ ఆన్-డిమాండ్ వీడియోను యాక్సెస్ చేయడం చాలా సులభం అవుతుంది. వారి మొబైల్ ఫోన్‌ల నుండి వారి టీవీ స్క్రీన్‌లను ప్రసారం చేయాల్సిన అవసరం లేకుండా రిలయన్స్ జియో జియోసినిమా యాప్ లభ్యత వల్ల వినియోగదారులు తమ అభిమాన మూవీని తమ టీవీలో సులభంగా ప్రసారం చేయగలుగుతారు.

JioCinema చందాదారులకు డిస్నీ కంటెంట్:
గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇటీవల జియో డిస్నీతో కలిసి తన జియో సినిమా అప్లికేషన్‌లో కూడా డిస్నీ కంటెంట్‌ను అందించింది. ఈ భాగస్వామ్యంలో రిలయన్స్ జియో చందాదారులు టాయ్ స్టోరీ 3, ది జంగిల్ బుక్, ది లయన్ కింగ్ వంటి మరిన్ని సినిమాలకు యాక్సిస్ పొందుతారు. రిలయన్స్ జియో యొక్క మరొక గొప్ప ఫీచర్ క్రోమ్‌కాస్ట్ యొక్క ఫీచర్. అంటే మీ యొక్క Mi టివిలో అంతర్నిర్మిత జియో సినిమా యాప్ ఉంటే కనుక అప్పుడు మీరు మీ స్క్రీన్‌ను మీ ముందు ఉన్న టివిలో ప్రసారం చేయగలుగుతారు. జియో సినిమా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, మరియు భోజ్‌పురి వంటి వివిధ భాషలలో మద్దతును అందిస్తుంది మరియు ఇది మైడౌన్లోడ్స్, ఆటో ప్లే టివి సర్వీస్, వాచ్‌లిస్ట్ మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications