Home
News

జియో గిగా ఫైబర్ ఫిషింగ్ మెయిల్స్ తో స్కామ్!! మోసపోకండి

ఇండియాలో రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రయోగం కోసం మిలియన్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ ఆపరేటర్ కొత్త సర్వీస్ ను ప్రకటించినప్పటి నుంచి వినియోగదారులకు దాని సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రాంతాలలో డిమాండ్ తీవ్రతను అంచనా వేయడానికి ఇది ఒక ఆసక్తి రూపాన్ని కూడా రూపొందించింది.

reliance jio phishing mails

ఇప్పుడు గిగా ఫైబర్ యొక్క వాణిజ్య ప్రయోగానికి దగ్గరలో ఉంది. ఇది కూడా వచ్చే నెలలో ప్రయోగం జరగబోతోంది. ఏదేమైనా ఈ శుభవార్తను ఉపయోగించుకొని రిలయన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్‌ను అందించడం పేరిట వినియోగదారులను స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని హానికరమైన ఇమెయిల్‌లు మరియు చెడు ఉద్దేశిత సంఘటనల నివేదికలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇటువంటి మెయిల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చివరి వరకు చదవండి.

ఫిషింగ్ అంటే ఏమిటి?:

ఫిషింగ్ అంటే ఏమిటి?:

స్కామ్ చేసే వారు ప్రజలను తమ ఉచ్చులోకి రప్పించడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మొదట అర్థం చేసుకోవడానికి ఫిషింగ్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఫిషింగ్ అనేది టెక్ పరిభాష యొక్క పదం ఇది వంచనను సూచిస్తుంది. ఫిషింగ్ ప్రయత్నాలలో హ్యాకర్ లేదా స్కామర్ మొదటగా వెబ్‌సైట్‌ను నమ్మదగిన విధంగా కనిపించేల చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. తరువాత మీ బ్యాంక్ సమాచారం, పాస్‌వర్డ్‌లు, ప్రైవేట్ సమాచారం లేదా ఏదైనా ఇతర సున్నితమైన డేటాను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంలో స్కామర్లు మెయిల్ గ్రహీతల నుండి పెమెంట్స్ చేయించటానికి వారు రిలయన్స్ జియో ప్రతినిధులు వలె నటిస్తారు.

స్కామర్ల నుండి రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఫిషింగ్ మెయిల్స్:

స్కామర్ల నుండి రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఫిషింగ్ మెయిల్స్:

ఈ సంఘటనపై కొన్ని నివేదికల ప్రకారం కొంతమంది కస్టమర్లు "గిగాఫైబర్ - యాక్టివేషన్ రిక్వెస్ట్ రిసీవ్డ్" అనే పేరుతో ఇమెయిళ్ళను అందుకున్నారు. ఈ మెయిల్ లోపల జియో డిజిటల్ లైఫ్ మాస్ తెడ్ ఉంది. మెయిల్‌లో ప్రణాళికలు మరియు ధరలతో పాటు వారి సభ్యత్వాన్ని ధృవీకరించడానికి వినియోగదారులకు లింక్‌లను అనుసరించాలని ఆదేశంతో అందించిన లింక్‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి మెయిల్ మీకు వచ్చినట్లయితే మీరు దానిని ఓపెన్ చేయకండి మరియు దానిని ఏ ఒక్కరికి సిఫార్సు చేయకండి.

స్కామర్ల ప్రయత్నాలు:

స్కామర్ల ప్రయత్నాలు:

స్కామర్లు తమ ప్రయత్నాలలో ఒక మైలు ముందుకు వెళ్ళారని మరియు జియో ఉపయోగించే మెసేజ్ ను తగినన్ని ఫాంట్‌లు మరియు గ్రాఫిక్‌లతో జియో నుండి ప్రతిరూపం చేశారని కూడా గమనించాలి. ఇది గ్రహీతలకు పంపిన ఇమెయిల్ అధికారిక మూలం.దీని ద్వారా మీకు ఇది రిలయన్స్ జియో నుండి వచ్చినదనే భ్రమ వస్తుంది. అయినప్పటికీ పంపినవారి ఇమెయిల్‌ను నిశితంగా పరిశీలించినప్పుడు ఇమెయిల్ యొక్క మూలం నిజమైనది కాదని వినియోగదారులు వేరుగా చెప్పగలుగుతారు.

రిలయన్స్ జియో గిగా ఫైబర్ చుట్టూ ఉన్న హైప్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 42 వ AGM లో వచ్చే నెలలో ఈ సేవ వాణిజ్యపరంగా ప్రారంభించబడుతుండటం వలన స్కామర్లు ఈ సర్వీస్ పట్ల ఆసక్తిగల కస్టమర్లను మోసగించడానికి సరైన అవకాశంగా చూడవచ్చు. కాబట్టి మీకు అలాంటి మెయిల్ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అటువంటి మెయిల్‌ను స్కాముగా నివేదించి దానిని వెంటనే తొలగించడం చాలా మంచిది.

 

రిలయన్స్ జియో గిగా ఫైబర్ సరసమైన ధర:

రిలయన్స్ జియో గిగా ఫైబర్ సరసమైన ధర:

రిలయన్స్ జియోగిగా ఫైబర్ సర్వీస్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో మరియు సరసమైనదిగా ఉంటుంది. దీని యొక్క ధర నెలకు 600 రూపాయల నుండి ప్రారంభమవుతుంది . ఇది టీవీ మరియు ల్యాండ్‌లైన్‌తో పాటు హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది. ఇందులో మరొక విషయం ఏమిటంటే ఈ ప్లాన్ జియో సూట్ యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో గిగాఫైబర్ ఇంటర్నెట్ వేగం:

రిలయన్స్ జియో గిగాఫైబర్ ఇంటర్నెట్ వేగం:

రిలయన్స్ జియో గిగాఫైబర్ కస్టమర్లు 1Gbps వరకు డేటా వేగాన్ని పొందగలుగుతారు. ఇది ఇంటర్నెట్ యొక్క గరిష్ట వేగం మరియు ప్రీమియం ఖర్చుతో కూడుకున్నది అయితే సరసమైన ధరలతో పాటు ఇంటర్నెట్ వేగం కూడా తగ్గుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
reliance jio phishing mails
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X