Micromax నుంచి కొత్తగా మూడు స్మార్ట్‌ఫోన్‌లు!!! చైనా ‌ఫోన్‌లకు దీటుగా...

|

ఇండియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తిరిగి రాబోతోంది. ఒకప్పుడు ఇండియాలో నోకియా ఫోన్లకు గట్టి పోటీగా నిలబడి అందరికి ఇష్టమైన బ్రాండ్‌గా ఎదిగిన ఈ సంస్థ తరువాత చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలోకి ప్రవేశంతో కనుమరుగయింది.

ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్

ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్

ఇప్పుడు ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్‌లను బ్యాన్ చేయాలనే నినాదం రావడంతో మార్కెట్లో మళ్ళి తన సత్తా చాటుకోవాలని మైక్రోమాక్స్ సంస్థ చూస్తున్నది. ఇందులో భాగంగా కొత్త అప్ డేట్ లతో మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి "ప్రీమియం" ఫీచర్లతో మరియు మిగిలిన రెండూ కూడా "మోడరన్ లుక్" తో బడ్జెట్ విభాగంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మైక్రోమాక్స్ అధికారిక ప్రకటనకు ముందుగా తన సోషల్ మీడియా ద్వారా టీజ్ చేసింది. మైక్రోమాక్స్ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ల యొక్క మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ సంస్థ తన చివరి స్మార్ట్‌ఫోన్ ఐఓన్ నోట్ ను అక్టోబర్‌ నెలలో విడుదల చేసింది. ఇది ఇప్పుడు కూడా రూ.8,199 రిటైల్ ధర వద్ద ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. చైనా స్మార్ట్‌ఫోన్‌లపై వ్యతిరేక భావాలు తారా స్థాయికి చేరుకోవడంతో మైక్రోమాక్స్ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పునరాగమనానికి లైన్ క్లియర్ అయింది. వచ్చే నెలలో మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రూ.10,000 ధరల విభాగంలో లాంచ్ అయ్యే సూచనలు అధికంగా ఉన్నాయి.

చైనా స్మార్ట్‌ఫోన్‌లపై వ్యతిరేకత

చైనా స్మార్ట్‌ఫోన్‌లపై వ్యతిరేకత

దేశంలో చైనా స్మార్ట్‌ఫోన్‌లపై పెరుగుతున్న వ్యతిరేక భావనల కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ల కోసం మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీనికి కారణం దేశంలో బడ్జెట్ ధరలో లభించే మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్‌లలో నాలుగు చైనావి కావడం కొసమెరుపు. ఇండియాలో అధికంగా మార్కెట్ వాటాను కలిగి ఉన్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కానిది శామ్‌సంగ్ మాత్రమే. మరోవైపు స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ ఒకప్పుడు ఈ విభాగంలో రారాజు. ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడానికి మరియు పునరాగమనంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడానికి మైక్రోమాక్స్ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మైక్రోమాక్స్ సంస్థ తన ట్వీట్లలో #MadeByIndian మరియు #MadeForIndian అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా చూపుతోంది.

మైక్రోమాక్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు

మైక్రోమాక్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు

మైక్రోమాక్స్ సంస్థ ఇండియాలో LED టీవీ, ఎయిర్ కండీషనర్లు(AC), వాషింగ్ మెషీన్‌లతో సహా పలు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. వీటి యొక్క మార్కెట్ కూడా ఇండియాలో ఒక మోస్తారుగా నడిచింది. మైక్రోమాక్స్ సంస్థ ప్రస్తుతం ఏడు ల్యాప్‌టాప్‌లు మరియు ఏడు టాబ్లెట్‌లను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది.

మైక్రోమాక్స్ ఐఒన్ నోట్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఐఒన్ నోట్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఐఓన్ నోట్‌ స్మార్ట్‌ఫోన్ రూ.8,199 ధరను కలిగి ఉంది. ఇది వెనుక భాగంలో గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లో 13MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో పాటు 3950mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ రీబ్రాండ్

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ రీబ్రాండ్

కొంతమంది చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మాదిరిగా మైక్రోమాక్స్ కంపెనీ తన ఫోన్‌లను ఇండియాలో తయారు చేస్తుందో లేదో అన్న దాని మీద వివరాలు తెలియాలసి ఉంది. OEM లకు అత్యంత నమ్మదగిన మార్గం చైనాలో తయారు చేయబడిన పరికరాలను పొందడం మరియు వాటిని ఇక్కడ అమ్మడం. మైక్రోమాక్స్ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్లు కేవలం చైనా స్మార్ట్‌ఫోన్ వ్యతిరేకతకు తయారుచేస్తున్న రీబ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అనే ఆందోళన కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Micromax Comeback with 3 New Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X