14 ఏళ్ల తరువాత దారుణమైన నష్టాల్లో ఐబిఎమ్

Written By:

ఐబిఎమ్..పూర్తి పేరు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్..ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సేవల సంస్థ..ఈ సంస్థ 14 ఏళ్ల చరిత్రను తిరగరాసుకుంది. అదీ దారుణ నష్టంతో..వివరాల్లోకెళితే ఈ సంస్థ దాదాపు 14 సంవత్సరాల తరువాత దారుణంగా నష్టపోయింది. మార్చి 31తో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే, 4.6 శాతం తగ్గి 18.68 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ వార్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయగా, ఐబిఎం ఈక్విటీ విలువ ఏకంగా 5 శాతానికి దిగజారింది.

Read more: రూ. 6 వేల కోట్ల జరిమానాతో అల్లాడుతున్న టీసీఎస్

14 ఏళ్ల తరువాత దారుణమైన నష్టాల్లో ఐబిఎమ్

ఐబీఎం ఆదాయం గత నాలుగేళ్లుగా తగ్గుతూ వస్తుండగా, ఇంత ఎక్కువ మొత్తంలో తగ్గడం మాత్రం ఇదే తొలిసారి. అయితే సంస్థను తిరిగి నిలిపేందుకు గత సంవత్సరం క్లౌడ్ ఆధారిత సేవలను, డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సేవలను అందించడం మొదలు పెట్టామని, సంప్రదాయ హార్డ్ వేర్ వ్యాపారాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిన్నీ రోమెట్టీ తెలిపారు.

Read more: షాకిచ్చిన ఆపిల్ : ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే !

అయినప్పటికీ క్లౌడ్ సేవల నుంచి అనుకున్నంత ఆదాయం పొందలేకపోయామని వివరించారు. ఐబిఎమ్ గురించి మీకు తెలియని 12 విషయాలను ఈ సందర్భంగా అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : ఆర్యభట్టకు 41 వసంతాలు: గుర్తు చేసుకోవాల్సిన నిజాలెన్నో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఐబిఎమ్‌ను దాదాపు 100 సంవత్సరాల క్రితమే స్థాపించారు. ఎంటర్‌ప్రెజన్యూర్ హెర్మన్ హెల్లరిత్ ట్యాబెలేటింగ్ మెషిన్ కంపెనీ పేరుతో 1888లో దీన్ని స్థాపించారు. ఆ తరువాతే ఇది ఐబిఎమ్ గా మారింది. జూన్ 15 1911న ఇది కార్పోరేషన్ కంప్యూటింగ్ టాబ్యులేటింగ్ రికార్డింగ్ కార్పోరేషన్ గా అవతరించింది.

2

1969 1971 మధ్యలో అపోలో మిషన్ లో చంద్రుని మీద అడుగుపెట్టడానికి అమెరికా వ్యోమగాములకు ఐబిఎమ్ కంప్యూటర్ కంపెనీ సహాయం చేసింది.

3

ఐబిఎమ్ నుంచి వచ్చిన ఫస్ట్ పోన్ ఇది. ఫస్ట్ రియల్ స్మార్ట్ ఫోన్ గా మన్ననలు కూడా పొందింది.

4

అయిదు మంది ఐబిఎమ్ ఉద్యోగులు నోబెల్ శాంతి బహుమతిని ముద్దాడారు.

5

20వ శతాబ్దంలో కూడా ఐబిఎమ్ కంపెనీ చాలా స్ట్రిక్ గా ఉండాలని రూల్స్ పెట్టింది. డ్రెస్ కోడ్ ఫర్ పెక్ట్ గా ఉండాలని ఆంక్షలు కూడా విధించింది.

6

ప్రపంచంలోని తెలివన పీపుల్స్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఐబిఎమ్ చెస్ కంప్యూటర్ ని కనిపెట్టింది.

7

ఐబిఎమ్ నిక్ నేమ్ బిగ్ బ్లూ . బ్లూ కలర్ తో అనేక ఆవిష్కరణలు చేయడంతో కంపెనీకి ఆ పేరు స్థిరపడిపోయింది.

8

ఐబిఎమ్ రీసెర్చర్ కూతురు పజిల్ సాల్వ్ చేయడం చూసిన తరువాత అది క్లాజికల్ కీ బోర్డ్ ఆవిష్కరణ ఏర్పాటుకు ఆలోచనను రేకెత్తించింది. అదే ఆ తరువాత ధింక్ ప్యాడ్ బటర్ ఫ్లై కీ బోర్డ్ గా ముందుకు వచ్చింది.

9

ఒకే సంవత్సరంలో 4000 పేటెంట్లను పొందినక కంపెనీగా ఐబిఎమ్ అమెరికాలో రికార్డు సృష్టించింది. యుఎస్ హిస్టరీలోనే ఇదే ఇప్పటికీ రికార్డు. 2008లో ఇది జరిగింది.

10

టెక్నాలజీ ఆవిష్కరణల్లో ఐబిఎమ్ చరిత్ర చాలా పెద్దది. బార్ కోడ్స్ దగ్గర నుంచి ఫ్లాఫీ డిస్క్ ల దాకా అన్ని రకాలు వస్తువులను ఆవిష్కరించింది.

11

ప్రపంచంలోనే అత్యంత చిన్న సినిమా ఆవిష్కర్తలు ఎబిఎమ్ కంపెనీ వాళ్లే.

12

ఐబిఎమ్ న్యూ జనరేషన్ చిప్ ని క్రియేట్ చేసింది. ఇది 4096 "neurosynaptic" cores కలిగి ఉంది.

13

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write IBM reports worst quarterly revenue in 14 years
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot