శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు లేనేలేదు

Written By:

మొబైల్ అతిగా వాడేవారికి ఇది నిజంగా శుభవార్తలాంటిదే. సాధారణంగా మొబైల్ ఫోన్ వాడితే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు దరిచేరతాయని అనేక మంది యూజర్లు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి ముప్పు ఏమీ లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి వాటి ఫలితాలను వెల్లడించారు.

Read more : ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..

మొబైల్ ఫోన్లు వాడకానికి బ్రెయిన్ క్యాన్సర్ కు అసలు సంబంధమే లేదని తేల్చేశారు. ఫోన్లు వాడకం వల్లే బ్రెయిన్ క్యాన్సర్ రావడం లాంటివి జరగవని తెలిపారు. మొత్తం 20 వేల మంది పురుషులు, 14వేల మంది స్త్రీలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు వేసి ఈ విషయాలను నిర్ధారించుకున్నారు. దీంతో పాటు 1982-2012 మధ్య బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తుల వివరాలు, 1987-2012 మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి డేటాను సిడ్నీ రీసెర్చర్స్ సేకరించారు.

Read more: మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

ఈ డేటాను పరిశీలించగా ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ పెరుగుతుందన్న సూచనలు తమకు కనిపించలేదని రీసెర్చ్ బృందం వెల్లడించింది. అయితే మొబైల్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూడండి .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

1.6 వాట్స్-కేజీ టిష్యూ ఎస్ఏఆర్‌కన్నా తక్కువ ఉన్న మొబైల్‌ఫోన్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు 

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

సిగ్నల్స్ సరిగ్గా ఉన్నప్పుడే కాల్ చేయాలి.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

వీలైనంత వరకు ఎస్సెమ్మెస్‌లకే పరిమితం కావడం మంచిది.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

సెల్‌ను ఉపయోగించనప్పుడు శరీరానికి దూరంగా ఉంచాలి.ఫోన్‌ను నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలను వాడటం మంచిది.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ఫోన్లకు తప్పని సరిగా కవర్‌ ఉండాలి. బెల్డ్‌ పౌచ్‌లోనే ఫోను ఉండాలి

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ఇక ఎండాకాలమయితే చాలావాటికి దూరంగా ఉండటం మంచిది. లొకేషన్, గూగుల్ మ్యాప్స్, నావిగేటర్ వంటివి ఎక్కువగా వినియోగించకూడదు.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ప్రయాణాలలో ఉన్నప్పుడు, అవసరం లేని సమయాల్లో మొబైల్ ను ఫ్లైట్ మోడ్ లో ఉంచడం తప్పనిసరి.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ఈ వేసవిలో మొబైల్ లో గేమ్స్ ఆడటం నిలిపి వేయాలి. ర్యామ్ పై ఒత్తిడి పెంచే యాప్స్ ను వాడకపోవడమే ఉత్తమం.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ఎప్పటికప్పుడు మొబైల్ లో బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే అనవసర యాప్ లను క్లోజ్ చేస్తూ ఉండాలి. రోజుకు కాసేపయినా మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం మంచిది.

శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు తప్పిందట

ఇలా చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mobile phones DON'T increase the risk of brain cancer, 30-year study concludes
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot