మోటరోలా 75-inch 4K టీవీ ధర ఎంతో తెలుసా.... ?

|

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తరువాత కొన్ని రోజుల క్రితం మోటరోలా సంస్థ తన మోటరోలా స్మార్ట్ టీవీల సీరీస్ తో స్మార్ట్ టీవీ రంగంలోకి ప్రవేశించింది. వన్‌ప్లస్ మాదిరిగా కాకుండా మోటరోలా సంస్థ ఎక్కువ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది పెద్ద స్క్రీన్ పరిమాణాలతో ప్రీమియం విభాగాలను కూడా లక్షంగా చేసుకోవాలని చూస్తున్నది.

బడ్జెట్ సెగ్మెంట్
 

బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ తో మరియు ప్రీమియం స్మార్ట్ స్పేస్ లక్షణాలతో రూ.60,000 కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ఈ పంథాను కొనసాగించడానికి మోటరోలా ఇప్పుడు ఉన్న స్మార్ట్ టీవీ శ్రేణికి మరో పెద్ద స్క్రీన్ 75 అంగుళాల టీవీని జోడించింది.

ధర & లభ్యత వివరాలు

ధర & లభ్యత వివరాలు

మోటరోలా 75 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు ఇండియాలో విడుదల చేసింది. ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతున్నది. దీని ధర 1,19,900 రూపాయలు (దాదాపు రూ .1.2 లక్షలు). ఈ క్రొత్త మోడల్ ఫీచర్స్ పరంగా ఇతర చిన్న మోడళ్లతో సమానంగా ఉంటుంది అయితే స్క్రీన్ పరిమాణాల పరంగా మాత్రమే భిన్నంగా ఉంటుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

మోటరోలా యొక్క 75 అంగుళాల స్మార్ట్ టీవీ 4K IPS ప్యానెల్‌ను LED బ్యాక్‌లైటింగ్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. దీని ప్యానెల్ డాల్బీ విజన్ ఫార్మాట్ స్థానిక మద్దతుతో పాటు HDR10 కలర్ కు కూడా మద్దతు ఇస్తుంది. మోటరోలా స్మార్ట్ టీవీ 1GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 2.5GB RAM మరియు 16GB స్టోరేజ్‌ యొక్క స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆధునిక ప్రీమియం టీవీల మాదిరిగానే మోటరోలా 75-అంగుళాల టీవీ ఆండ్రాయిడ్ 9 పై OS ద్వారా రన్ అవుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మరో దీపావళి సేల్స్... స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి చివరి అవకాశంఫ్లిప్‌కార్ట్‌లో మరో దీపావళి సేల్స్... స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి చివరి అవకాశం

ఆండ్రాయిడ్ 9 పై
 

ఆండ్రాయిడ్ 9 పై టీవీ ఓఎస్‌తో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్ లకు యాక్సిస్ ను పొందడంతో పాటు క్రోమ్‌కాస్ట్ మద్దతును కూడా పొందుతారు. అందువల్ల మీరు మీ ఫోన్ నుండి టీవీకి వైర్‌లెస్ ద్వారా కంటెంట్‌ను ప్రసారం చేయగలరు. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతునిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వాయిస్ కమాండ్ల ద్వారా కంటెంట్‌ను శోధించడానికి మరియు ఇతర స్మార్ట్ ఉపకరణాలను కూడా నియంత్రించడానికి అనుమతిస్తుంది. మోటరోలా టీవీతో పాటుగా గేమ్‌ప్యాడ్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా టీవీలో గేమ్ లను సులభంగా ఆడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

లాంగ్ టర్మ్ ప్లాన్ రీఛార్జిలపై 2 నెలల అదనపు సేవలను అందిస్తున్న ఆపరేటర్లులాంగ్ టర్మ్ ప్లాన్ రీఛార్జిలపై 2 నెలల అదనపు సేవలను అందిస్తున్న ఆపరేటర్లు

మోటరోలా

మోటరోలా యొక్క 75 అంగుళాల టీవీ మోడల్‌లో డిటిఎస్ ట్రూసరౌండ్ సౌండ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే 30W స్పీకర్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఇందులో ఉన్న MEMC టెక్నాలజీ టీవీ యొక్క మెరుగైన వీక్షణ అనుభవం కోసం సున్నితమైన ఫ్రేమ్ రేట్లకు సహాయపడుతుంది.

55-అంగుళాల ఫ్రేమ్ టీవీ

75-అంగుళాల పెద్ద స్క్రీన్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇతర సంస్థలు కూడా కొన్ని టీవీలను దీని కంటే కొంచెం చిన్న ప్యానెల్ పరిమాణాల వద్ద మంచి పిక్చర్ నాణ్యతతో అందిస్తున్నాయి. శామ్సంగ్ ఇటీవలే తన 55-అంగుళాల ఫ్రేమ్ టీవీని QLED ప్యానెల్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. అలాగే షియోమి కూడా తన 65 అంగుళాల Mi టివిని ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో 54,999 రూపాయల ధర వద్ద అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola launches 75-inch 4K Android TV in India: Price,Offers,Availability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X