RS.8000 భారీ ధర తగ్గింపుతో అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌ లో శామ్‌సంగ్ గెలాక్సీ A 80

|

ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న దీపావళి సేల్స్ లో భాగంగా అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి ప్రసిద్ధ ప్లాట్‌ఫామ్‌లలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న శామ్‌సంగ్ ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలలో శామ్‌సంగ్ ప్రీమియం గెలాక్సీ A 80 స్మార్ట్‌ఫోన్‌ మీద భారీగా ధరను తగ్గించారు. ఇప్పుడు దీని మీద సుమారు రూ.8,000 లు తగ్గించి కేవలం రూ .39,990 కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందడానికి దీని కంటే మంచి తరుణం మరొకటి ఉండదు.

గెలాక్సీ A 80
 

గెలాక్సీ A 80 అనేది ఈ సంవత్సరం శామ్‌సంగ్ రిలీజ్ చేసిన A-సిరీస్‌ లలో టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్. ఇంకా కంపెనీ నుండి వచ్చిన ప్రయోగాత్మక ఫోన్‌లలో కూడా ఒకటి. ఇది రెండువైపుల తిరగగల ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెట్-అప్ రూపకల్పనతో మరియు నాచ్లెస్ న్యూ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఫీచర్స్ లతో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 80 స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారిగా జూలై నెలలో భారతదేశంలో విడుదల చేశారు. ఇది 128GB స్టోరేజ్ మరియు 8GB RAM, 3,700mAh బ్యాటరీ సామర్ధ్యం మరియు డాల్బీ అట్మోస్ ఇంటిగ్రేషన్ ను కలిగి ఉండి రూ.47,990 ధర వద్ద రిలీజ్ అయింది.

ధర తగ్గింపు వివరాలు

ధర తగ్గింపు వివరాలు

ఇండియాలో ప్రస్తుతం శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌లలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 80 రూ. 39,990ల కొత్త ధర వద్ద లభిస్తుంది. అదేవిధంగా ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి తాజా ధరల తగ్గింపు ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా వర్తిస్తుందని సూచించారు. మొదటగా ఇది ఇండియాలో రూ.47,990 ధర వద్ద రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు ఇది రూ.8,000 ధర తగ్గింపును పొందింది.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A 80 డ్యూయల్ నానో సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై యొక్క వన్ UIతో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ న్యూ ఇన్ఫినిటీ డిస్ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730G SoCను కలిగి ఉండి దీనికి తోడుగా 8GB RAMతో జతచేయబడి ఉంటుంది.

కెమెరా

ఫోటోలు మరియు వీడియోల విషయానికి వస్తే శామ్‌సంగ్ గెలాక్సీ A 80 స్మార్ట్‌ఫోన్‌లో రెండు వైపులా తిరిగే కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో f / 2.0 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ కెమెరా 123-డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ తో f/ 2.2 లెన్స్‌తో వస్తాయి. IR సెన్సార్‌ ఫీచర్ గల 3D డెప్త్ కెమెరా మూడవ కెమెరాగా ఉంది. ఈ కెమెరా సెటప్ ను రెండు వైపులా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీలను తీసుకోవడానికి కెమెరాలో సెల్ఫీ మోడ్‌ను ఎంచుకున్న తర్వాత ఇది ఆటోమ్యాటిక్ గా తిరుగుతుంది.

కనెక్టివిటీ

శామ్‌సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీని కలిగి ఉంటుంది. అదనపు మెమరీ కోసం ప్రత్యకమైన SD కార్డ్ స్లాట్ ఇందులో లేదు. ఈ ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి ఉన్నాయి. అంతేకాకుండా ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 3,700 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy A80 Price Slashed in India: Price, Offers and Availability details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X