మోటరోలా ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Posted By:

గూగుల్ - మోటరోలా సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న టాప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘నెక్సస్ 6' ఇండియన్ మార్కెట్లో రూ.7,000 ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. విడుదల సమయంలో నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్ 32జీబి మోడల్ ధర రూ.43,999. ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా ఈ మోడల్ రూ.36,999కి లభ్యమవుతోంది. విడుదల సమయంలో 64జీబి మోడల్ ధర రూ.48,999 ఉండగా ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా రూ.41,999కి లభ్యమవుతోంది.

(చదవండి: ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000, ఏ7000)

మోటరోలా ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

ఇదే క్రమంలో మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ పై రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్‌లను మోటరోలా అందిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లలో భాగంగా మోటో టర్బో స్మార్ట్‌ఫోన్ పై రూ.10,000 వరకు, మోటో ఇ (సెకండ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 వరకు, మోటో జీ పై రూ.5,000 వరకు రాయితీలను పొందవచ్చు.

(చదవండి: టాప్ 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.8,000 ధరల్లో))

English summary
Motorola Nexus 6 available at a discount of Rs 7,000 in India. Read More in Telugu Gizot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot