JPG ఫైల్‌ను PDF రూపంలోకి మార్చడం ఎలా?

|

ఏదైనా ఫైల్‌లను మీరు JPG నుండి PDF గా మార్చినట్లయితే మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా మీరు PDF ఫైల్‌ను JPG కన్నా చిన్న ఫైల్ పరిమాణంలోకి కుదించవచ్చు. అలా చేస్తే PDF ఆకృతిలో ఉన్న ఫైల్ గొప్ప నాణ్యతతో ఏప్పటికీ భద్రపరచబడుతుంది.

JPG - PDF ఫార్మాట్

JPG - PDF ఫార్మాట్

అంతేకాకుండా మీరు ఇమేజ్ ఫైళ్ళను PDF ఫైళ్లుగా మార్చడం ద్వారా ఒకే ఫైల్‌లో ఎక్కువ డాక్యుమెంట్ లను బధ్రపరచవచ్చు. ప్రస్తుతం స్కాన్ చేసిన పేజీలు అన్ని కూడా JPG ఫార్మాట్లో సేవ్ చేయబడతాయి. JPG ని PDF గా మార్చడానికి కేవలం కొన్ని పద్దతులను పాటించి సులభంగా మార్చవచ్చు. ఆ పద్దతుల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:D2h HD STBను కొనాలనుకుంటున్నారా!!! అయితే ఈ ఆఫర్ చూడండి...

PDF ఫైల్‌ ఫార్మాట్

PDF ఫైల్‌ ఫార్మాట్

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ప్రజలు ఇప్పుడు దానికి అనుగుణంగా మారుతున్నారు. ఇంతకు మునుపు తమ యొక్క సర్టిఫికెట్లు, ఫైలులు మరియు ఏదైనా డాక్యుమెంట్ల పేపర్లను చాలా భద్రంగా ఇంటిలో దాచుకునే వారు. కానీ తరువాత వారు వాటన్నిటిని స్కాన్ చేసి JPG ఫార్మాట్లో సేవ్ చేసుకొవడం మొదలుపెట్టారు. కానీ ఈ JPG ఫార్మాట్లో కేవలం ఒక డాక్యుమెంట్ ను మాత్రమే సేవ్ చేస్తుంది. మరొక దానిని స్కాన్ చేసి మరొక ఫైల్ మాదిరి సేవ్ చేయవలసి ఉంటుంది. వాటన్నిటికీ కూడా అధిక స్టోరేజ్ అవసరం అవుతుంది. అధిక పరిమాణంలో గల JPG ఫార్మాట్ నుండి PDF గా ఫైల్‌ను కుదించి తక్కువ పరిమాణంలో సేవ్ చేసుకోవచ్చు.

కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్‌లో JPG ని PDF గా మార్చే పద్ధతులు

కంప్యూటర్‌లో ఆఫ్‌లైన్‌లో JPG ని PDF గా మార్చే పద్ధతులు

కంప్యూటర్లలో మీరు ప్రత్యేకంగా JPG ఫైళ్ళను PDF లకు మార్చడానికి ఎటువంటి మూడవ పార్టీ యాప్ ను ఇంస్టాల్ చేయకుండా Windows మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో JPG ని PDF గా సులభంగా మార్చవచ్చు.


1. మీరు Mac కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంటే కనుక ప్రివ్యూలో JPG ఫైల్‌ను ఓపెన్ చేయండి.

2. తరువాత డ్రాప్-డౌన్ మెను నుండి ఫైల్ మీద క్లిక్ చేసి ఎక్సపోర్ట్ PDF ఎంపికను ఎంచుకోండి. తరువాత కావాలంటే మీరు పేరును మార్చవచ్చు.> తరువాత సేవ్ బట్టెన్ మీద నొక్కండి.

 

విండోస్ 10లో JPG ని PDF గా మార్చే పద్ధతులు

విండోస్ 10లో JPG ని PDF గా మార్చే పద్ధతులు

3. మీరు విండోస్ 10 ఉపయోగిస్తుంటే కనుక JPG ఫైల్‌ను ఓపెన్ చేసి Ctrl + P కమాండ్ లేదా ప్రింట్ కమాండ్ ఇవ్వండి.

4. ప్రింటర్ సెట్టింగులలో మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు PDF ఎంపికను ఎంచుకోండి.>PDF కోసం మీకు కావలసిన ఫోటో పరిమాణాన్ని ఎంచుకొండి> తరువాత ప్రింట్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

5. తరువాత ఫైల్ యొక్క పేరును నమోదు చేయండి> ఫైల్ను సేవ్ చేయదలిచిన స్థానాన్ని ఎంచుకోండి> తరువాత సేవ్ ఎంపికను నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Convert your JPG image to PDF Format in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X