‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

Posted By:

అతిపెద్ద మొబైల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013' సోమవారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమైంది. ఈ మొబైల్ గాడ్జెట్ షోను పురస్కరించుకుని ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు ఆధునిక ఆలోచనలతో ముందుకొచ్చాయి. ఎండబ్ల్యూసీ 2013ను పురస్కరించుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్, జడ్‌టీఈ, ఆల్కాటెల్, హవాయి, లెనోవో, హెచ్‌పి, ఏసర్ వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాయి. గిజ్‌బాట్ ఆ వివరాలను స్లైడ్‌షో రూపంలో మీకందిస్తోంది.

లోపలికి స్వాగతం..సమ్‌థింగ్ స్పెషల్

హైదరాబాద్ పేలుళ్లు.. ‘ఆ వీడియోలో ఏముంది'?

టెక్ చిట్కా: ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

గెలాక్సీ నోట్ 8.0 - ఐప్యాడ్‌కు కిల్లర్ కానే కాదు (Galaxy Note 8.0 - Oh! It's not an iPad Mini killer):

8 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ను తమ పాకెట్‌లో క్యారీ చేద్దామనుకునే వారికి గెలాక్సీ నోట్ 8.0 బెస్ట్ చాయిస్. యాపిల్ ఐప్యాడ్ మినీకి పోటీగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0 పేరుతో ట్యాబ్లెట్ తరహా మొబైల్ ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది.

ఫీచర్లు.....
8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ ఎక్సినోస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఎస్-పెన్, 2జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 4600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ,
విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు.

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వోఎస్ - జడ్‌టీఈ ఓపెన్ ఇంకా ఆల్కాటెల్ వన్‌టచ్ ఫైర్ (Mozilla Firefox OS - ZTE Open and Alcatel One Touch Fire):

అవును... మొజిల్లా మొబైల్ ప్లాట్‌ఫామ్ వచ్చేసింది. ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లైన జడ్‌టీఈ ఇంకా ఆల్కా‌టెల్‌లు సరికొత్త ఫైర్‌ఫాక్స్ వోఎస్ పై స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌లను వృద్ది చేసాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లను తొలిగా యూరోప్‌లో విడుదల చేయునున్నారు.

జడ్‌టీఈ ఓపెన్:

మొజిల్లా ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల డిస్‌ప్లే,
కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్.

ఆల్కాటెల్ వన్ టచ్:

3.5 అంగుళాల డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
255ఎంబి ర్యామ్,
512ఎంబి స్టోరేజ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-పై.

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

హవాయి ఆసెండ్ పీ2 (Huawei Ascend P2):

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీ బ్రాండ్ హవాయి ‘ఆసెండ్ పీ2' పేరుతో సరికొత్త 720 పిక్సల్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కీలక స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎమోషనల్ యూజర్ ఇంటర్‌ఫేస్,
4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్),
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, ఎల్‌టీఈ కనెక్టువిటీ,
2013 రెండవ త్రైమాసికం నుంచి ఈ ఫోన్ లభ్యం కానుంది.

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

లెనోవో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ - ఏ1000, ఏ3000, ఎస్6000 (Lenovo Android tablets - A1000, A3000 and S6000):

2013 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ను పురస్కరించుకని ప్రముఖ బ్రాండ్ లెనోవో మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లను ఆవిష్కరించింది. లెనోవో ఏ1000, ఏ3000, ఎస్6000 మోడళ్లలో ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పీసీలు లభ్యం కానున్నాయి.

లెనోవో ఏ1000:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 600),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

లెనోవో ఏ3000:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 X600పిక్సల్స్),
1.2గిగాహఎట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
16జీబి మెమెరీ (మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సాయంతో మెమరీని 62జీబికి పొడిగించుకోవచ్చు),
వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ.

లెనోవో ఎస్6000:

10 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్.

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

ఏసర్ బీ1 - ఏ71 : 16జీబి ఇంటర్నల్ మెమెరీతో (Acer B1-A71 - Now with 16GB internal memory):

ప్రముఖ కంప్యూటర్ తయారీ బ్రాండ్ ఏసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో కూడిన ఏసర్ బీ1-ఏ71 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 8జీబి వేరింయట్ కూడా మార్కెట్లో లభ్యంకానుంది. కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల డిస్‌ప్లే,
512ఎంబి ర్యామ్,
ప్లాస్టిక్ బాడీ,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి వేరియంట్ ధర €139 (రూ.9,916).

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013’: కొత్త ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్‌లు

హెచ్‌పి స్లేట్ 7 - ఈ ఏప్రిల్‌లో విడుదల (HP Slate 7 - Coming this April):

ప్రపంచపు అతిపెద్ద పీసీ తయారీ సంస్థ హెచ్‌పి, ‘స్లేట్ 7' పేరుతో సరికొత్త ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ధర $169 (రూ. 9,142). స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 600పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా,
బీట్స్ ఆడియో సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot