రేపటి నుంచి దేశవ్యాప్త మొబైల్ పోర్టబులిటీ
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ) విధానాన్ని జూలై 3 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) కార్యాదర్శి రాకేష్ గార్గ్ ఓ ప్రముఖ దినపత్రికకు వెల్లడించారు.
Read More: మనిషిని చంపేసిన రోబోట్

సవరణలతో కూడిన ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారుడు తన ఫోన్ నెంబర్‌ను మార్చుకోకుండానే దేశవ్యాప్తంగా టెలికం సర్వీసులను అందించే ఆపరేటర్‌లను మార్చుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడలో ఉన్న వినియోగదారుడు ముంబైకు మారితే తన నెంబర్‌ను మార్చుకుండానే ఆ సర్కిల్‌లోని నెట్‌వర్క్‌లకు ట్రాన్స్‌ఫర్ కావొచ్చు. ఇప్పటి వరకు ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అనేది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంది.
Read More: ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు!


Click it and Unblock the Notifications








