ఖాదీ దుస్తులే కొంపముంచాయా..? నేతాజీ మంటల్లో..

Written By:

నాకొక రక్తపు చుక్కనివ్వు.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తా.. అనే నినాదంతో, యువతలో దేశభక్తిని రగిలించిన పోరాట యోధుడు. 'అజాద్‌ హింద్‌ ఫౌజ్‌'ని స్థాపించి, బ్రిటిష్‌ పాలకులను దేశం నుంచి తరిమి తరిమి కొట్టిన వీరుడు నిలువునా మంటల్లో కాలిపోయారు. విమాన ప్రమాద సమయంలో ఎగసిన మంటల్లో నేతాజీ తీవ్రంగా కాలిపోయారని బ్రిటీష్ వెబ్‌సైట్ కథనం వెలువరిచింది. మంటల్లో నడుస్తున్న అగ్నిగోలంలా ఆయన ఉన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నట్లుగా వెబ్‌సైట్ కథనం రాసింది. ఆలాగే ఆయన చివరిమాటలు బయటి ప్రపంచానికందించింది.

Read more: నేతాజీ మృతిపై గాంధీజీ గందరగోళం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌కు వెళ్లినప్పుడు దేశం కోసం చివరివరకు పోరాడానని చెప్పు

నేతాజీ తన అనుచరుడితో ‘‘భారత్‌కు వెళ్లినప్పుడు దేశం కోసం చివరివరకు పోరాడానని చెప్పు భారత్‌కు స్వాతంత్ర్యం వస్తుంది ఎవరూ బందీగా ఉంచలేరు నా దేశాన్ని అంటూ చివరిసారిగా చెప్పారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనే విషయాన్ని బ్రిటీష్ వెబ్‌సైట్ వెలుగులోకి తెచ్చేందుకు ఆ యోధుడి గురించి నిజాలను తెలిపేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో అనేక విషయాలను

ఈ నేపథ్యంలో అనేక విషయాలను మనకందించింది. అయితే తాజాగా సరికొత్త విషయాలను బయటపెట్టింది. నేతాజీతో పాటు ప్రయాణించిన వారి అనుభవాలకు సంబంధించిన దస్త్రాలను ఇంటర్నెట్‌లో ఉంచింది. విమాన ప్రమాదంలో ఆయన కాలిపోతుండగా ఆయనతో ప్రయాణించిన వారు కళ్లారా చూశారని కథనంలో పేర్కొంది.

ఆగస్టు 18, 1945న నేతాజీ ప్రయాణిస్తున్న విమానం

ఆగస్టు 18, 1945న నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ఎడమ ఇంజిన్ వూడిపోవడంతో ప్రమాదం జరిగిందని వెంటనే కూలిపోవడంతో నేతాజీ మంటల్లో చిక్కుకున్నారని ఆ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను బోస్ ఫైల్స్ ఇన్ఫో అనే వెబ్‌సైట్ లో ఉంచారు.

1956లో నేతాజీ అంతర్ధానంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన

1956లో నేతాజీ అంతర్ధానంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాజవాజ్ ఖాన్ త్రి సభ్య కమిటి రిపోర్టులతో సహా మరో ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల కథనాలను బయటపెట్టారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారిలో ఒకరు నేతాజీ అనుచరుడు హబీబ్ ఉర్ రహమాన్ కాగా, మిగతా ఇద్దరు ఎయిర్ స్టాఫ్ అధికారి, సహ ప్రయాణికుడు ఉన్నారు.

వియాత్నంలోని టౌరేన్ నుంచి జపాన్ కు చెందిన విమానం

వియాత్నంలోని టౌరేన్ నుంచి జపాన్ కు చెందిన విమానం నేతాజీతో పాటు 12,13 మంది ఇతర ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. జపాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునమస షిదే కూడా అందులోనే ఉన్నారు.

అప్పుడు వాతావరణం బాగా ఉందని సాయంత్రంలోగా

అప్పుడు వాతావరణం బాగా ఉందని సాయంత్రంలోగా తైపీకి చేరుకోవాలని ఫైలెట్ భావించాడని నేతాజీపై భారత్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి నేతృత్వం వహించిన ఇండియన్ నేషనల్ జనరల్ షానవాజ్ ఖాన్ పేర్కొన్నారని తెలిపింది.

విమానం ఎడమవైపు ఇంజిన్ సరిగా పనిచేయడంలేదని

విమానం ఎడమవైపు ఇంజిన్ సరిగా పనిచేయడంలేదని గమనించాను. విమానంలోకి వెళ్లి పరీక్షించాను. బాగానే పనిచేసింది. మరో ఇంజనీర్ కూడా పరీక్షించి ప్రయాణించడానికి అనుకూలంగా ఉందని ధ్రువీకరించారని జపాన్ ఎయిర్ స్టాప్ అధికారి మేజర్ టరొ కొనొ తెలిపారు.

విమానం ఎడమ ఇంజిన్ లో లోపం ఉన్నట్లు ఫైలెట్ మేజర్ కొనొకు

విమానం ఎడమ ఇంజిన్ లో లోపం ఉన్నట్లు ఫైలెట్ మేజర్ కొనొకు తెలిపాను ఐదు నిమిషాలు పరిశీలించిన తరువాత పైలెట్ రెండుసార్లు పరీక్షించారు. బాగానే ఉందని పైలెట్ చెప్పడంతో విమానం బయలు దేరింది. అయితే బయలుదేరిన తరువాత కొద్ది దూరం వెళ్లగానే ఎడమవైపు ఇంజిన్ ఊడిపోయింది. మంటలు చెలరేగాయని విమానశ్రయ నిర్వహణ ఇంజనీర్ యమమొటో తెలిపినట్లు కథనంలో వెల్లడించింది.

విమానం దాదాపు నలభై మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత

విమానం టోక్యో వెళ్లవలసి ఉందని పేర్కొంది. మధ్యలో తైపీలో ఆగి బయలుదేరింది. విమానం దాదాపు నలభై మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత రన్ వే నుంచి వంద మీటర్ల దూరం వెళ్లిందని, ముందు భాగంలో మంటలు చెలరేగాయని, ఈ శబ్ధం ఫిరంగి గుళ్ల వర్షంలా వచ్చిందని, విమానం ఎడమ వైపుకు ఒరిగిందని సాక్ష్యులు చెప్పినట్లు అందులో పేర్కొంది.

సాక్షుల కథనం ప్రకారం

సాక్షుల కథనం ప్రకారం విమానం బయలుదేరిన కొద్ది సమయానికే పెద్ద శబ్దం వచ్చింది. నేతాజీ నా వైపు వచ్చారు. వెనుకవైపు నుంచి వెళ్లలేం. ముందు నుంచి వెళ్లండి అని నేతాజీకి తెలిపాను. ముందు మార్గం సామాగ్రితో నిండిపోవడంతో వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. మంటల నుంచి నేతాజీ మేమూ దూకాం.

నేతాజీవి ఖాదీ దుస్తులు కావడంతో

అయితే ఉన్ని దుస్తులు ధరించడంతో నాకు మంటలు అంటుకోలేదు. నేతాజీవి ఖాదీ దుస్తులు కావడంతో వెంటనే అంటుకున్నాయి. అతి కష్టం మీద ఆయన బెల్టును వూడదీసి చొక్కాను తొలగించాను. తరువాత పరిశీలించగా బోసు తలపై తీవ్రమైన గాయం కనిపించింది. మంటల ధాటికి నేతాజీ ముఖం వెంట్రుకలు కాలిపోయాయి.

మనవాళ్లు ఎలా ఉన్నారు? నీకేం ప్రమాదం లేదు కదా

మనవాళ్లు ఎలా ఉన్నారు? నీకేం ప్రమాదం లేదు కదా అని నేతాజీ నన్ను అడిగారు. బాగానే ఉన్నానని చెప్పారు. భారత్ కు వెళ్లినప్పుడు దేశం కోసం చివరి వరకు పోరాడానని చెప్పు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి తీరుతుంది. దాన్ని ఎవరూ బందీగా ఉంచలేరు. అని నేతాజీ తనతో చెప్పారని నేతాజీతో పాటు విమానంలో ప్రయాణించిన బోస్ అనుచరుడు అబిబ్ ఉర్ రెహమాన్ తెలిపినట్లు వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.

ప్రమాదం జరిగిన తర్వాత..

విమాన ప్రమాదాన్ని గుర్తించిన ఎయిర్ బేస్ సిబ్బంది ఆంబులెన్స్ లతోసహా ఘటనా స్థలికి చేరుకున్నారు. నేతాజీ సహా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అందర్నీ సమీపంలోని నన్మూన్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేసమయానికి బోస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.

ఈ సంఘటన గురించి తెలియగానే ఇండియాలోని బ్రిటిష్ అధికారులు

ఈ సంఘటన గురించి తెలియగానే ఇండియాలోని బ్రిటిష్ అధికారులు ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులను వియత్నాంకు పంపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రిలో బోస్ పరిస్థితి గురించి బ్రిటిష్ పాలకులకు సమాచారం అందించారు.

అయితే వీరందరూ చెప్పినది నిజమా కాదా

అయితే వీరందరూ చెప్పినది నిజమా కాదా అని విషయం పక్కనబెడితే విమానం ప్రమాదానికి గురైన మాట వాస్తవం కనుక నేతాజీ మంటల్లో చిక్కుకున్నారని నిర్థారణ అయింది.విమాన ప్రమాదం జరిగి ఉండదని ఏడు దశాబ్దాలుగా కొన్ని వర్గాల్లో సందేహాలు ఉన్నాయని, అయితే నాలుగు నివేదికలు ఆయన విమాన ప్రమాదంలోనే చనిపోయినట్లు వచ్చాయని ఇది తెలిపింది.

వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్ వెబ్ సైట్..

నేతాజీ మరణించినట్లుగా భావిస్తున్న రోజు (ఆగస్టు 18, 1945)న అసలేం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలం ఆధారంగా రూపొందించిన పత్రాల్ని బ్రిటన్ కు చెందిన బోస్ ఫైల్స్ ఇన్ఫో అనే వెబ్ సైట్ విడుదల చేసింది.

తర్వాత ఏం జరిగింది?

బోస్ ఆసుపత్రిలో కోలుకున్నారా? లేక పరమపదించారా? ఆయన్ని చూడటానికి ఇండియా నుంచి ఎవరైనా వెళ్లారా? అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం జనవరి 16 వరకు నిరీక్షించాలి. అదే రోజున బోస్ ఫైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది www.bosefiles.info వెబ్ సైట్.

నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్‌సైట్..

నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్‌సైట్.. ఆసక్తికర కథనం మీకోసం. https://telugu.gizbot.com/news/website-on-netajis-last-days-launched-in-uk-012900.html

మరణానికి ముందు ఏం జరిగింది ?

మరణానికి ముందు ఏం జరిగింది ? మరింత ఆసక్తికర కథనం.. https://telugu.gizbot.com/news/u-k-website-releases-papers-of-day-before-bose-plane-crash-013004.html

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Eyewitness accounts of Netaji plane crash released by website
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot