శుభవార్త అదిరింది : రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నమాటే ఉండదు

Written By:

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పారు. అది ఇప్పటికిప్పుడు అందుబాటులోకి రాకున్నా మరో నాలుగేళ్లు ఆగితే బస్సెక్కినట్టే రైలును ఎక్కేయొచ్చని చెప్పారు. అసలు 2020 నాటికి వెయిటింగ్ లిస్ట్ అన్న పదమే వినిపించదని ఆయన చెప్పారు. 2020 నాటికి అమ్ముడవుతున్న టికెట్లు, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యతో సమానంగా ఉంటుందని, ప్రయాణికుల సంఖ్యలో సీట్లుంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కడుంటుందని ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more: మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

శుభవార్త అదిరింది : రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నమాటే ఉండదు

రైల్వే ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో తాము చేపట్టిన చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయన్నారు. 2020 నాటికి వెయిటింగ్ లిస్ట్ అన్నదే ఉండబోదని ప్రకటించారు. టికెట్ కొనుగోలు సమయంలోనే ప్రయాణికులకు బెర్త్ కన్ ఫర్మ్ చేసేస్తామని చెప్పుకొచ్చారు. రైల్వే శాఖ ఈ మధ్య పెట్టిన కొత్త సర్వీసులు కూడా మంచి సత్ఫలితాన్నే ఇస్తున్నాయి.

Read more : రైల్వే శాఖ బంఫర్ ఆఫర్ : రైల్వే టికెట్‌తో విమానంలో ప్రయాణం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని విస్తరించింది.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్ / ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం చెల్లుబాటుకాదు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

అయితే వికల్ప్ కింద ఈ ప్రత్యామ్యాయ వసతి కల్పించాక మీరు ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. అంతే కాకుండా చార్జీలో తేడాలున్నా మీకు ఎటువంటి రీఫండ్ ఇవ్వరు.దీనికి ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు.

 

 

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

ఇక తత్కాల్ లో అయితే మీరు మీ ప్రయాణానికి సంబంధించి టికెట్లను రద్దు చేసుకుంటే టికెట్ లో సగం మొత్తం వెనక్కిస్తారు . ప్రస్తుతం ఇందులో అటువంటి రీఫండ్ సౌకర్యం లేదు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

ఇందులో భాగంగా తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు కూడా చేశారు. ఏసీ బుకింగ్ లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ లకు ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

ఇప్పటిదాకా ఇది ఇంగ్లీష్ భాషలోనే లభించేది. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ మీరు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య కూడా పెంచారు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందే అవకాశం కూడా ఉంది. 

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

మరో కొత్త పధకాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.అదే సువిధ పధకం. ఈపథకం కింద రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం ఏదైనా చూపించబడుతుంది.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్లు ఉన్న సర్వీసు రైళ్లకు ముగింపు ప్రీమియం ఉంటుంది. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు 'వేకప్ కాల్' సౌకర్యం కూడా కొత్తగా ఏర్పాటు చేశారు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే సాంకేతికత సహాయంతో హెచ్చరికలు చేసే కొత్త విధానాన్ని అవలంబించనుంది. సీసీ కెమెరాలు, రేడియో పౌనఃపున్యం ఆధారంగా పనిచేసే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్ ఫాం టికెట్, అన్ రిజర్వ్డ్ టికెట్, సీజన్ టికెట్లను కొనొచ్చు.

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

రైల్వేలో ట్రాక్ మరమ్మతులకు ట్రాక్మెన్, కీమెన్ల కోసం తేలికైన టూల్ కిట్ను రైల్వే తీసుకొచ్చింది. దీని ద్వారా రీపేర్లు అనే మాటకు తావే ఉండదని రైల్వే శాఖా మంత్రి ధీమ ావ్యక్తం చేస్తున్నారు. 

రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నదే ఉండదు

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write No waiting list only confirmed online rail tickets by 2020 Suresh Prabhu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot