Home
News

తక్కువ ధరతో ఇండియాలో మొదలైన నోకియా 105 ఫోన్ అమ్మకాలు

నోకియా గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లలో కొన్ని ఫీచర్ ఫోన్‌లను ప్రకటించింది. గత సంవత్సరం నోకియా 8110 లేదా సాధారణంగా బనానా ఫోన్ గా పిలిచే ఈ ఫోన్ నేడు 2019 మార్కెట్ లో నోకియా 105 గా రూపాంతరం చెంది ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ యొక్క ధర 1,199 రూపాయలుగా ఉంది. ఇది ఈ నెలలో చైనాలో మొదట ప్రారంభించబడింది.

Nokia 105 Old phones Sales Start Again Cheaper Price in India

నోకియా బ్రాండెడ్ ఫోన్‌లను తయారు చేసి విక్రయించే HMD గ్లోబల్ సంస్థ తన నాలుగవ తరం ఫీచర్ ఫోన్ 'నోకియా 105' ను భారతదేశంలో 1,199 రూపాయలకు విడుదల చేసింది. ఈ ఫోన్ నోకియా.కామ్ మరియు భారతదేశం అంతటా ఎంచుకున్న మొబైల్ రిటైల్ అవుట్‌లెట్లలో నీలం, పింక్ మరియు నలుపు వంటి మూడు కలర్లలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

సాధారణ ఫీచర్ ఫోన్ మాదిరిగానే నోకియా 105 లో కూడా చిన్న TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.77-అంగుళాల కొలతలను కలిగి ఉంటుంది. ఇది 120 x 160 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. ముక్యంగా ఇది 800 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌కు స్టాండ్‌బై సమయం 25.8 రోజులు మరియు టాక్‌టైమ్ 14.4 గంటలు అని నోకియా తెలిపింది. ఈ కొత్త ఫోన్ 2,000 మంది కాంటాక్ట్ లను మరియు 500 మెసేజ్ లను స్టోర్ చేసుకొనే మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ :

కనెక్టివిటీ :

సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ సిరీస్ 30+ OS తో నడుస్తుంది.ఇది టెట్రిస్, డేంజర్ డాష్, నింజా UP!, స్కై గిఫ్ట్, నైట్రో రేసింగ్ మరియు ఎయిర్‌స్ట్రైక్ వంటి ఆటలను అందిస్తుంది. అంతేకాకుండా ఇది క్లాసిక్ స్నేక్ గేమ్‌ను కూడా స్పష్టంగా ఆడటానికి వీలుగా ఉంది. కనెక్టివిటీ వారీగా ఫోన్ వినియోగదారుకు ఛార్జింగ్ కోసం మైక్రో-USB1.1 స్లాట్‌ను అందిస్తుంది. మరియు ఇది డ్యూయల్ సిమ్ ఎంపికతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు రేడియో వినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఫోన్లో కెమెరా లేదు.

డిజైన్:

డిజైన్:

నోకియా 105 ఫోన్ 119 x 49.2 x 14.4 మిమీ కొలతలతో వస్తుంది మరియు దీని బరువు 74.04 గ్రాములు. డిజైన్ పరంగా ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో తయారు చేయబడింది. ఇది బ్లూ, పింక్ మరియు బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలతో వస్తుంది. ఈ రోజు నుండి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

HMD గ్లోబల్ చీఫ్:

HMD గ్లోబల్ చీఫ్:

నోకియా 105 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల ఫోన్లు అమ్ముడైనాయి. ఇది నోకియా మొదటగా రిలీజ్ చేసిన తన పాత ఫోన్‌గా దాని ప్రజాదరణ మరియు కాలాతీత నాణ్యతను మళ్ళి రుజువు చేస్తుంది. చలనశీలతను స్వీకరించాలనుకునేవారి కోసం రూపొందించిన ఫీచర్ ఫోన్‌ల వరుసలో ఇది నాల్గవ తరం ఫోన్ అని HMD గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ అధికారి జుహో సర్వికాస్ తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia 105 Old phone's Sales Start Again Cheaper Price in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X