ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

|

ఇప్పుడు ఉన్న స్మార్ట్ రంగంలో ప్రపంచం మొత్తం మీద చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు అనేది ఇప్పుడు చాలా వరకు సర్వసాధారణం అయింది. దీనిని క్యాష్ చేసుకోవడానికి చాలా రకాల స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు రోజు రోజుకు మారుతున్న స్మార్ట్ విభాగానికి అనుగుణంగా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు.

 
10 biggest smartphone companies of the world

మీరు స్మార్ట్‌ఫోన్‌లను వడుతున్నారా? అయితే మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ యొక్క స్థానం తెలుసా?.ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా స్మార్ట్‌ఫోన్‌లను రవాణా చేసిన పెద్ద కంపెనీలు ఏవి అని ఆలోచిస్తున్నారా? గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గరిష్ట వాటా ఉన్న కంపెనీలు ఏవి? Q2 2019 కోసం కౌంటర్ పాయింట్ మార్కెట్ మానిటర్ ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ఫోన్ కంపెనీల జాబితా వెల్లడించింది వాటి యొక్క పేర్లు తెలుసుకోవడానికి కింద చదవండి.

శామ్సంగ్:

శామ్సంగ్:

దక్షిణ కొరియా కంపెనీ అయిన శామ్సంగ్ 2019 రెండవ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 21.3% మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేస్తు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ వాటా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఎగుమతుల పరంగా ఇది Y-o-Y లో 7.1% వాటా పెరిగింది.

హువాయి:

హువాయి:

రెండవ స్థానంలో ప్రముఖ చైనా టెక్ దిగ్గజం అయిన హువాయి కంపెని ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2019 Q2 చివరిలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 15.8% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 56.7 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌లను రవాణా చేసింది. ప్రపంచ ఎగుమతుల పరంగా ఇది 4.6% Y-o-Y వృద్ధిని అందిస్తున్నది.

ఆపిల్:
 

ఆపిల్:

కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యధిక స్మార్ట్‌ఫోన్ షిప్పింగ్ కంపెనీగా నిలిచింది. 2019 Q2 చివరిలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా10.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2018 Q2 లో కంపెనీ యొక్క మార్కెట్ వాటా 11.3% ను కలిగి ఉంది. 2019 Q2 లో ఉన్నా మార్కెట్ వాటాను 2018 Q2 తో పోలిస్తే దాని యొక్క మార్కెట్ వాటా 2019 Q2 లో 1.0%కు పడిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

షియోమి:

షియోమి:

Q2 2019 లో 0.9% Y-o-Y స్వల్ప వృద్ధితో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా ర్యాంకింగ్‌లో షియోమి నాల్గవ స్థానంలో ఉంది. ఈ త్రైమాసికంలో దాని ప్రపంచ మార్కెట్ వాటా 9% వద్ద ఉంది ముక్యంగా 2019లో షియోమి యొక్క స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందాయి 2017 లో దీని యొక్క ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ వాటా చాలా తక్కువ.

ఒప్పో:

ఒప్పో:

ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా జాబితాలో 5 వ స్థానంలో చైనా కంపెనీ అయిన ఒప్పో ఉంది. 2019 రెండవ త్రైమాసికం చివరినాటికి కంపెనీ 8.1% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2018 లో దీని యొక్క వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే దాని వార్షిక వృద్ధి 2% పడిపోయింది.

వివో:

వివో:

ఈ ర్యాంకింగ్ జాబితాలో ఆరో స్థానంలో ఉన్న మరొక చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో. ప్రపంచవ్యాప్తంగా వివో కంపెనీ మార్కెట్ వాటా 7.5% తో ఉంది. 2019 Q2 ప్రకారం ఈ కంపెనీ యొక్క వృద్ధి రేటు 2.1% Y-o-Y తో నమోదైంది. వివో యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా గత సంవత్సరంతో పోల్చితే చాలా బాగా వృద్ధి చెందింది.

లెనోవా :

లెనోవా :

ఇండియాలో మోటరోలా మొబైల్ బాగా ప్రాచుర్యం పొందడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడంతో మోటరోలా యాజమాన్య కంపెనీ అయిన లెనోవా యొక్క మార్కెట్ వాటా 2019 Q2 చివరిలో 2.6% వృద్ధి రేటుతో 2019 సంవత్సరానికి లెనోవా యొక్క ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా 6% పెరిగింది.

LG:

LG:

2019 Q2 సమయంలో సంవత్సరపు వృద్ధిలో 18.5% భారీ తగ్గుదలతో LG 8 వ స్థానంలో ఉంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాటా 2.2% వద్ద ఉంది స్మార్ట్‌ఫోన్ రంగంలో భారీగా పెరిగిన మార్పులను LG స్మార్ట్‌ఫోన్ అందుకోలేక భారీపతనాన్ని చవిచూడవలసి వచ్చింది.

HMD:

HMD:

మొబైల్ రంగంలో ఒకప్పుడు రారాజుగా ఉన్న నోకియా ఇప్పుడు బారి పతనాన్ని చూడవలసి వచ్చింది.ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న నోకియా ఇప్పుడు 20.21% భారీ తగ్గుదలతో 9వ స్థానానికి పడిపోయింది.తన స్థానాన్ని మళ్ళి తిరిగి పొందడానికి నోకియా ప్రస్తుతం వున్న అన్ని స్మార్ట్‌ఫోన్ లకు పోటీగా తన స్మార్ట్‌ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అయిన నోకియా తిరిగి తన స్థానాన్ని పొందుతుందో లేదో చూడాలి.

రియల్‌మి :

రియల్‌మి :

ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా జాబితాలో అతిపెద్ద లాభం చైనా కంపెనీ అయిన రియల్‌మి సంస్థది. స్మార్ట్‌ఫోన్ రంగంలోకి కొత్తగా ప్రవేసించినప్పటికీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాటా సంవత్సరానికి అత్యధికంగా 848% వృద్ధిని సాధించింది. మొత్తం ప్రపంచ మార్కెట్ వాటాలో 1.3% వాటా కంపెనీ కలిగి ఉంది.

 

 

Best Mobiles in India

English summary
10 biggest smartphone companies of the world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X