నోకియా చేతులు కలిపిన ఎయిర్‌టెల్, 5జీపై గురి

Written By:

మొబైల్ ఫోన్ల కంపెనీ శాంసంగ్ తో జియో ఒప్పందం చేసుకున్నట్టే.. నోకియాతో ఎయిర్ టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటి మధ్య 5G సేవల ఒప్పందం కుదిరింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది ఎయిర్‌టెల్. తమ రెండు సంస్థలు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు నోకియా ఇండియా ప్రతినిధులు. '

జియో ఫ్రైమ్‌మెంబర్ షిప్ వద్దనుకునుంటే మీరు పొందే బెనిఫిట్స్..

నోకియా చేతులు కలిపిన ఎయిర్‌టెల్, 5జీపై గురి

డాటా స్పీడ్, నెట్ వర్క్ కనెక్టివిటీ ఇలా అన్నింటిలో మెరుగైన సేవలే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు కలిశాయి. ఇప్పుడు మార్కెట్‌లో 4జీనే హైలెవల్ క్వాలిటీతో నడుస్తోంది. దీన్ని కన్నా అమితవేగంతో 5జీని అందించేందుకు రెండు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే పెట్టుబడి ఎంత పెడుతున్నారనే విషయం చెప్పలేదు.

సగంమంది జియో నుంచి బయటకు వస్తున్నారు !

భారతీ ఎయిర్‌టెల్ అతి పెద్ద నెట్‌వర్క్ గా అవతరించేందుకు రూ.7000 కోట్ల డీల్ కు ఓకే చెప్పింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్‌లను

మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్‌లను టెలికాం దిగ్గజం ఎయిర్‍టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్‍టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది.

ఓ నిర్ణయాత్మక ఒప్పందం

టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఏడు సర్కిళ్లను కొనుగోలు

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

అగ్రిమెంట్ ప్రకారం

అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్‌టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది.

వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే

వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్‌స్క్రైబర్‌బేస్‌లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia, Airtel To Collaborate On 5G, Internet Of Things Applications read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot