పిజ్జా కంటే ఫాస్ట్‌గా ఫోన్ డెలివరీ, Open Sale పై OnePlus 2

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ oneplus బెంగుళూరులో సరికొత్త ప్రమోషన్ ఆఫర్‌కు శ్రీకారం చుట్టుంది. తమ వనప్లస్ ఫోన్‌లను బుక్ చేసుకున్న వారికి పిజ్జా కంటే ఫాస్ట్‌గా ఫోన్‌ను డెలివరీ ఇస్తామని, 60 నిమిషాల్లో ఆ ఫోన్ డెలివరీ కాని పక్షంలో అదే ఫోన్‌ను ఉచితంగా ఇచ్చేస్తామని సంస్థ చెబుతోంది. ప్రస్తుతానికి బెంగుళూరులో మాత్రమే అందుబాటులో ఈ ప్రమోషన్ ఆఫర్‌ను త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. బెంగుళూరులో ఈ ప్రమోషన్ ఆఫర్ అక్టబోర్ 8, 9, 10 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఓ ఫోన్‌ను ఆర్డర్ పెట్టండి.

Read More : మార్స్ గ్రహం పై భయానక వాతావరణం

భారీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదలై ఇన్విటేషన్‌ల పద్ధతిలో విక్రయించబడుతోన్న వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఓపెన్ సేల్ పై అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తన అధికారిక ఫోరమ్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 12వ తేదిన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు Amazon Indiaలో అందుబాటులో ఉంచుతున్నట్లు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఓపెన్ సేల్‌లో పాల్గొనటానికి ఏ విధమైన invites అవసరం లేదు.

Read More : రూ.13,999కే మైక్రోమాక్స్ ల్యాప్‌టాప్

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్ (64 బిట్ విత్ 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ సాక్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్ (64 బిట్ విత్ 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ సాక్) విత్ 4జీబి ర్యామ్

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌తో అనుసంధానమయ్యే అలర్ట్ స్లైడర్

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ఈ లైట్ వెయిట్ ఫోన్ అవుటర్ ఫ్రేమ్‌ను బెస్ట్ క్వాలిటీ ఆల్యూమినియమ్, మెగ్నీషియం మెటీరియల్‌తో క్రాఫ్ట్ చేసారు. స్టెయిన్‌లెస్ స్టీల్ అసెంట్స్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విభిన్నమైన బ్యాక్ కవర్ ఫోన్‌కు మరింత ప్రత్యేకమైన లుక్‌ను తీసుకువస్తాయి

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల అద్భుతమైన డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ క్వాలిటీ 1080 పిక్సల్స్ (401 పీపీఐ)

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ లిథియమ్ పాలిమర్ బ్యాటరీ రోజంతా ఫోన్ పనిచేసేలా చూస్తుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తోంది. డివైస్‌లో పొందుపరిచిన 4జీబి ర్యామ్ స్మూత్ పెర్మామెన్స్‌ను కనబరుస్తుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ USB Type-C ఫెసిలిటీని సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ప్రత్యేకమైన మాక్స్ ఆడియో సౌండ్ డిజైనింగ్ వ్యవస్థను వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు. హైక్వాలిటీ సౌండ్ విలువలను ఈ ఫీచర్ ద్వారా ఆశించవచ్చు.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ ఫీచర్ల ద్వారా షార్ప్ క్వాలిటీ ఫోటోగ్రఫీని యూజర్లు పొందవచ్చు.

Best Mobiles in India

English summary
One Plus offers free phones after 60 minutes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X