OnePlus 8 Pro Sale : గొప్ప డిస్కౌంట్ లతో నేడే మొదటి సేల్స్!!! త్వరపడండి...
వన్‌ప్లస్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో గత నెలలో విడుదల అయ్యాయి. ఇందులో వన్‌ప్లస్ 8 యొక్క సేల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కానీ ఇందులో గల వన్‌ప్లస్ 8ప్రో వేరియంట్ యొక్క సేల్స్ మొదటిసారిగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలుకానున్నాయి.

వన్‌ప్లస్ 8 సిరీస్ సేల్స్
ఆన్‌లైన్‌లో పరిమిత కాలం వరకు మాత్రమే లభించే దీని యొక్క అమ్మకాలు అమెజాన్ ఇండియా మరియు వన్‌ప్లస్.ఇన్‌లలో మొదలుకానున్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి మధ్యాహ్నం 12 గంటలకు కొన్ని నిమిషాల ముందు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ప్రసుతం పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుందని వన్‌ప్లస్ సంస్థ తన అభిమానులకు ప్రత్యేకంగా తెలిపింది. కాబట్టి నిమిషాల్లో స్టాక్స్ అయిపోయే అవకాశం ఉన్నందున మీరు వీటిని కొనుగోలు చేయడానికి తొందరపడవలసి ఉంటుంది. వన్‌ప్లస్ 8 ప్రో మరియు 8 గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 8ప్రో 5G ధరల వివరాలు
ఇండియాలో వన్‌ప్లస్ 8ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.54,999 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ యొక్క మోడల్ ధర రూ.59,999. Also Read:Android 11 beta అప్‌డేట్‌ను అందుకుంటున్న షియోమి,వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

వన్‌ప్లస్ 8 5G ధరల వివరాలు
ఇండియాలో మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలలో విడుదల అయిన వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు గొప్ప ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇందులో బేస్ మోడల్ 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ ధర రూ.41,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.44,999 కాగా 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ గల హై వేరియంట్ యొక్క ధర 49,999 రూపాయలు.

వన్‌ప్లస్ 8 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్
వన్‌ప్లస్ 8సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ల యొక్క సేల్స్ లో భాగంగా SBI కార్డ్ హోల్డర్లు రూ.3,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే అమెజాన్ ఇండియా మరియు వన్‌ప్లస్.ఇన్ లో దీనిని 12 నెలల వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపిక ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్స్ లో వన్‌ప్లస్ రిలయన్స్ జియో యొక్క 6 వేల రూపాయల ప్రయోజనాలను అదనంగా అందిస్తోంది. Also Read:Oppo A52 స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే....

వన్‌ప్లస్ 8 ప్రో యొక్క అమెజాన్ సేల్స్ వివరాలు
వన్‌ప్లస్ 8 ప్రో యొక్క సేల్స్ ఈ నెలలో ఉండకపోవచ్చు అని చాలా మంది భావించారు. కానీ మొత్తానికి గొప్ప ఆఫర్లతో మొదటి సారిగా దీని అమ్మకాలు మొదలుపెట్టనున్నది. స్మార్ట్ఫోన్ తయారీదారు ఇప్పటికే వన్‌ప్లస్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు మరియు ధర వివరాలను వెల్లడించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు వన్‌ప్లస్.ఇన్ నుండి వన్‌ప్లస్ డివైస్ లపై కొంత తగ్గింపును కూడా పొందవచ్చు. వీటిలో వన్‌ప్లస్ 8 ప్రో ఆల్ ఇన్ బండిల్, ఛార్జ్ అండ్ ప్రొటెక్ట్ బండిల్, అటాచ్ బండిల్ మరియు లాంగ్ లైవ్ మ్యూజిక్ బండిల్ వంటివి ఉన్నాయి. వన్‌ప్లస్ 8 ప్రో ను కొనుగోలు చేసిన వారికి వన్‌ప్లస్ మ్యూజిక్ బండిల్ వంటి వాటిని డిస్కౌంట్ ధరలో పొందవచ్చు. వీటిలో కార్బన్ బంపర్, శాండ్‌స్టోన్ బంపర్ మరియు క్లియర్ బంపర్ వంటి ఎంపికలు కూడా ఉన్నాయి. మరిన్ని డిస్కౌంట్ వివరాలను వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

వన్‌ప్లస్ 8ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
వన్‌ప్లస్ 8ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ HD + ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉండి 90HZ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలతో లభిస్తూ అడ్రినో 650 GPU మరియు స్నాప్‌డ్రాగన్ 865 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ OS 0 ద్వారా రన్ అవుతున్న ఫోన్ UFS 3.0 స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది.

వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్ వెర్
వన్‌ప్లస్ యొక్క సరికొత్త వన్‌ప్లస్ 8ప్రో ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో రన్ అవుతూ అడ్రినో 650 GPU తో జత చేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ 8ప్రో స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి సౌండ్ కాన్సల్ తో పాటు డాల్బీ అట్మోస్‌కు మద్దతును ఇస్తుంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వన్‌ప్లస్ 8ప్రో కెమెరా సెటప్
వన్‌ప్లస్ 8ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను f / 1.75 ఎపర్చరు పరిమాణంతో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటికి మద్దతును ఇస్తుంది. 16 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో వస్తుంది. ఈ సెటప్‌లో చివరిది 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా జతచేయబడి ఉంది. అలాగే దీని వెనుకభాగంలో డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ జతచేయబడి ఉంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX471 సెన్సార్ f / 2.45 ఎపర్చరుతో ఉంది.


Click it and Unblock the Notifications








