Oppo A52 స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే....
ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ప్రముఖ చైనా సంస్థ ఒప్పో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. ఇప్పుడు బడ్జెట్ విభాగంలో కూడా తన సత్తా చాటడానికి కొత్తగా ఒప్పో A52 ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో కొన్ని నెలల ముందు దీనిని ఆవిష్కరించారు.

ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్
బడ్జెట్ విభాగంలో రెండు కలర్ ఎంపికలలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా జూన్ 17 నుండి ప్రారంభంకానున్నాయి. ఒప్పో A52 వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉండడమే కాకుండా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: OPPO A12 అద్భుతమైన ఫీచర్స్ మరియు గేమ్ ఇన్నోవేషన్‌లతో రూ.9,990 లకే స్మార్ట్‌ఫోన్

ఒప్పో A52 యొక్క ధరల వివరాలు
ఒప్పో A 52 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లలో విడుదల చేసారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 16,990 రూపాయలు. ఈ ఫోన్ ట్విలైట్ బ్లాక్ మరియు స్ట్రీమ్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లబిస్తుంది. ఈ ఫోన్ జూన్ 17 నుండి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా విక్రయించబడుతుంది.

ఒప్పో A52 సేల్స్ ఆఫర్స్
ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఎటువంటి ఖర్చులేని EMI ఎంపికతో పాటు స్టాండర్డ్ EMI ఎంపికలను కూడా పొందవచ్చు. Also Read:Jio యొక్క ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ను పొందడం ఎలా?

ఒప్పో A52 స్పెసిఫికేషన్స్
ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1 తో రన్ అవుతుంది. ఇది 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేని 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉండి 8GB RAMతో జత చేయబడి ఉంటుంది.

ఒప్పో A52 ఫీచర్స్ & కెమెరా సెటప్
ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాల విషయానికొస్తే ఇది వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 2 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో కూడిన రెండు కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

ఒప్పో A52 కనెక్టివిటీ
ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉంది. అలాగే వై-ఫై, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఈ ఫోన్ 162.0x75.5x8.9mm కొలతలతో 192 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








