వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలపై RS.5,000ల భారీ డిస్కౌంట్

|

మీ ఇంటిలో ఉన్న పాత టీవీను చూసి మీకు బోర్ కొట్టిందా! అయితే కొత్త టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే మీ మనసు స్మార్ట్ టీవీల వైపు ఉంటే కనుక ఇప్పుడున్న వాటిలో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ఉత్తమమైనది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. గడిచిన ఫెస్టివల్ సీజన్ లో మీరు ఈ టీవీలను కొనలేకపోయిఉంటే కనుక మీకు మరొక అవకాశం వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ రెండు మోడల్లపై దాదాపు రూ.5000 వరకు తగ్గింపు లభిస్తోంది.

వన్‌ప్లస్ టీవీ
 

మీరు సరికొత్త వన్‌ప్లస్ టీవీ Q1 లేదా వన్‌ప్లస్ టీవీ Q1 ప్రోని కొనాలని చూస్తున్నట్లయితే ఈ రెండు స్మార్ట్ టీవీ మోడళ్లను ఇ-రిటైలర్ అమెజాన్ వీటి మీద కొన్ని ప్రత్యేకమైన మరియు మనోహరమైన ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన ఆఫర్ ఏమిటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కలిగి ఉంటే కనుక మీరు మరింత అదృష్టవంతులు. HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించడంపై రూ.5,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది.

కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ లను పొందిన పాత 5 Mi టీవీలు

అమెజాన్

రెండు టీవీ మోడళ్ల ఉత్పత్తి జాబితాల ప్రకారం అమెజాన్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ను ఉపయోగించి వన్‌ప్లస్ టీవీ Q1 ను కొనుగోలు చేసిన రూ.4,000 తక్షణ తగ్గింపు మరియు వన్‌ప్లస్ టీవీ Q1 ప్రో కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. పైన పేర్కొన్న చెల్లింపు మోడ్‌లలో ఒకదాన్ని ఉపయోగించడంపై రెండు డిస్కౌంట్‌లు ఆటోమ్యాటిక్ గా వర్తించబడతాయి.

ధరల వివరాలు

ధరల వివరాలు

ప్రస్తుతం అమెజాన్ లో వన్‌ప్లస్ టీవీ Q1 యొక్క ధర రూ. 69,900లు ఉండగా వన్‌ప్లస్ టీవీ Q1 ప్రో ధర రూ. 99,900గా ఉంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ఉపయోగించి ఆఫర్‌ను వర్తింపజేసిన తరువాత వన్‌ప్లస్ టివి Q1ను రూ. 65,900, మరియు వన్‌ప్లస్ టీవీ Q1 ప్రో ను కేవలం రూ. 94,900లకు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్
 

అదనంగా అమెజాన్ వన్‌ప్లస్ టీవీ ధరను మరింత తగ్గించడానికి లేదా ఇతర ప్రయోజనాలను పొందటానికి క్లబ్ చేసిన ఇతర ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్‌లలో ఒకటి ఎక్స్ఛేంజ్ ఆఫర్- మీరు మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.4,800 తగ్గింపు పొందవచ్చు. అదనంగా దీపావళి టీవీ ఫైర్ స్టిక్ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్ టీవీ కొనుగోలుదారులు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ను దాని అసలు ధర రూ. 3,999తో పోలిస్తే కేవలం రూ.2,399లకు పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీ

స్మార్ట్ ఫోన్లలో తనకంటు ప్రతేక గుర్తింపు తెచ్చుకున్న తరువాత వన్‌ప్లస్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. వన్‌ప్లస్ టీవీ క్యూ 1, వన్‌ప్లస్ టీవీ క్యూ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో ఈ టీవీలను గత నెలలో ఇండియాలో విడుదల చేశారు. రెండు వేరియంట్ల టీవీలు 55-అంగుళాల 4K QLED ప్యానెల్లు మరియు 50W సౌండ్ అవుట్‌పుట్ కలిగి ఉంటాయి.

కార్బన్ ఫైబర్

ఈ రెండు టీవీలు వెనుకవైపు కార్బన్ ఫైబర్ లాంటి ముగింపును కలిగి ఉండి ప్రత్యేకమైన స్టాండ్ డిజైన్‌తో వస్తాయి. వన్‌ప్లస్ ప్రో మోడల్‌ మాత్రమే టేబుల్-టాప్ స్టాండ్‌ను అందిస్తుంది. అలాగే వన్‌ప్లస్ టీవీ క్యూ 1 కొనుగోలుదారులు రూ. 2,990ల విలువైన స్టాండ్‌ను విడిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus TV gets Instant Discount Up to Rs. 5,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X