Oppo Find X2 Pro యొక్క కొత్త ఎడిషన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి...

|

ఈ సంవత్సరం కొత్తగా మార్కెట్ లోకి విడుదల అవడానికి సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ‌ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో ఒకటి. ఇప్పుడు ఈ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో నడిచే ఫైండ్ ఎక్స్ 2 ప్రో ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్‌ను ప్రకటించింది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్‌

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్‌

5G కనెక్టివిటీ మరియు అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఫీచర్లతో లభించే ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. లంబోర్ఘిని బ్రాండ్ కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ డిజైన్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ డిజైన్

ఒప్పో సంస్థ విడుదల చేస్తున్న ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో యొక్క కొత్త లంబోర్ఘిని ఎడిషన్ ఒక ప్రత్యేక బాక్స్ లో వస్తుంది. ఇది సూపర్ స్పోర్ట్స్ కారు యొక్క శైలిలో డిజైన్ ను కలిగి ఉంది. ఫోన్ మీద లంబోర్ఘిని యొక్క సంతకం షట్కోణ ఆకారంలో ఉండడమే కాకుండా Y- ఆకారపు హెడ్‌లైట్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క బాక్స్ లో ఛార్జర్, యుఎస్‌బి కేబుల్, ఇన్-వెహికల్ ఫ్లాష్ ఛార్జర్ మరియు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు వంటివి కూడా ప్యాక్ చేయబడి ఉన్నాయి.

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ వేరియంట్స్
 

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ వేరియంట్స్

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ బూడిద, పసుపు, లేత నీలం, ముదురు నీలం మరియు నారింజ వంటి ఐదు వేర్వేరు కలర్ ఎంపికలలో లభిస్తుంది. అన్ని వేరియంట్ ఫోన్‌లలో లంబోర్ఘిని యొక్క సంతకం వేరు వేరు కలర్ లో ఉంటుంది.

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల క్యూహెచ్‌డి + అల్ట్రా విజన్ డిస్‌ప్లే 120Hz QHD + 10bit OLED స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో రన్ అవుతూ 12GB ర్యామ్ మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడి వస్తుంది.

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ ఫీచర్స్

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ ఫీచర్స్

ఒప్పో ఫైండ్ X2 ప్రో లంబోర్ఘిని ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరా లెన్స్ విషయానికొస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 12MP వైడ్ యాంగిల్-లెన్స్ మరియు 13MP టెలిఫోటో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ కెమెరా సెటప్‌ వెనుక భాగంలో కుడివైపు ఎగువ భాగంలో దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో 32 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 4,200 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది 65W SuperVOOC 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo Find X2 Pro Lamborghini Edition Specs, Features Reveled

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X