Oppo 125W సూపర్ ఫ్లాష్ ఛార్జర్!!! 20min లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్...

|

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇప్పుడు కొత్తగా మరో శ్రీకారానికి తెరలేపింది. ఇందులో భాగంగా 125W ఫ్లాష్ ఛార్జ్, 65W AirVOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌తో పాటు 50W మినీ సూపర్‌వూక్ ఛార్జర్ మరియు 110W మినీ ఫ్లాష్ ఛార్జర్‌తో సహా కొత్త ఛార్జర్‌లను ఒప్పో సంస్థ ఆవిష్కరించింది.

ఒప్పో  కొత్త ఛార్జర్‌లు

ఒప్పో కొత్త ఛార్జర్‌లు

ఒప్పో  కొత్త ఛార్జర్‌లు హై-పవర్ వైర్డ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలతో తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. 125W ఫ్లాష్ ఛార్జ్ అధునాతన ఎన్క్రిప్షన్ అల్గోరిథం తో పాటుగా ఉష్ణోగ్రతను నియంత్రణ చేసే ఫీచర్లను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు సురక్షితమైన ఫ్లాష్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో 125W ఫ్లాష్ ఛార్జర్ వివరాలు

ఒప్పో 125W ఫ్లాష్ ఛార్జర్ వివరాలు

ఒప్పో సంస్థ విడుదల చేసిన 125W ఫ్లాష్ ఛార్జర్ యొక్క సరికొత్త టెక్నాలజీ సాయంతో కేవలం ఐదు నిమిషాల్లో 4000mAh బ్యాటరీని 41% వరకు మరియు 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది. ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ దాని మునుపటి సూపర్‌వూక్ మరియు VOOC ఫ్లాష్ ఛార్జ్ ప్రోటోకాల్‌లకు అనుకూలంగా ఉంటుందని కూడా తెలిపారు. 125W ఫ్లాష్ ఛార్జ్ అనేది 65W USB పవర్ డెలివరీ (USB-PD) మరియు 125W ప్రోగ్రామబుల్ పవర్ సప్లై (PPS) వంటి ప్రోటోకాల్‌లకు మద్దతు ఇస్తుంది.

ఒప్పో 125W ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీ

ఒప్పో 125W ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీ

ఒప్పో సంస్థ విడుదల చేసిన 125W ఫ్లాష్ చార్జర్ అత్యంత అధునాతన ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు సూపర్‌వూక్ డిజైన్ యొక్క సమగ్ర హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్ అప్‌గ్రేడ్ గా తయారుచేసారు. ఫ్లాగ్‌షిప్ ఛార్జర్ 20V 6.25A ఛార్జింగ్ స్కిమ్ కు మద్దతు ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఒప్పో 125W ఫ్లాష్ చార్జర్ మెరుగైన విద్యుత్ సాంద్రత ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఛార్జర్ పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం లేకుండా ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. 125W ఫ్లాష్ చార్జర్ ద్వారా ఛార్జింగ్ స్థితిని పర్యవేక్షించడం మరియు ఛార్జింగ్ సమయంలో అత్యధిక భద్రతను నిర్ధారించడంలో వినియోగదారులకు సహాయపడే 10 అదనపు ఉష్ణోగ్రత సెన్సార్లను కలిగి ఉంటుంది.

Oppo 65W AirVOOC వైర్‌లెస్ ఫ్లాష్ చార్జర్

Oppo 65W AirVOOC వైర్‌లెస్ ఫ్లాష్ చార్జర్

ఒప్పో యొక్క 65W ఎయిర్‌వూక్ వైర్‌లెస్ ఫ్లాష్ చార్జర్ 4000mAh బ్యాటరీని 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదని ఒప్పో సంస్థ తెలిపింది. ఈ ఫ్లాగ్‌షిప్ వైర్‌లెస్ ఛార్జర్‌లో విదేశీ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఫంక్షన్లతో పాటు ఐదు రెట్లు భద్రతా ప్రొటెక్షన్ చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా 65W AirVOOC వైర్‌లెస్ ఫ్లాష్ చార్జర్ కూడా Qi ప్రమాణానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇది కేబుల్ రహిత సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవాన్ని అందించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.

ఒప్పో మినీ సూపర్‌వూక్ ఛార్జర్

ఒప్పో మినీ సూపర్‌వూక్ ఛార్జర్

ఒప్పో సంస్థ వీటితో పాటుగా చిన్న మరియు సన్నని 50W మినీ సూపర్‌వూక్ ఛార్జర్ మరియు డ్యూయల్ లెవల్ ఆర్కిటెక్చర్‌తో 110W మినీ ఫ్లాష్ ఛార్జర్‌ను కూడా విడుదల చేసింది. మినీ సూపర్‌వూక్ ఛార్జర్ 10.05mm మందంతో 60 గ్రాముల బరువుతో వస్తుంది. 50W మినీ సూపర్‌వూక్ ఛార్జర్ VOOC ప్రోటోకాల్‌లతో పాటు 27W PD మరియు 50W PPS టెక్నాలజీ మద్దతుతో వస్తుంది.

5G రోల్‌అవుట్ & గేమింగ్

5G రోల్‌అవుట్ & గేమింగ్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 5G రోల్‌అవుట్, గేమింగ్ మరియు వీడియో వీక్షణ అధికం అయింది. ముఖ్యంగా గేమింగ్ ని అధికంగా ఇష్టపడే వారికి మరియు వీడియో యాప్ లను అధికంగా వినియోగించే వారికి మొబైల్ ఫోన్‌ల బ్యాటరీ జీవితానికి మరియు వినియోగదారు ఛార్జింగ్ అనుభవానికి కొత్త సవాళ్లను సూచిస్తుంది అని ఒప్పో చీఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ శాస్త్రవేత్త జెఫ్ జాంగ్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Oppo Introduces 125W Flash Charger, 65W AirVooc wireless Charger and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X