Home
News

మొదలైన ఒప్పో రెనో 2Z యొక్క ప్రీ-బుకింగ్స్

ప్రముఖ చైనా సంస్థ ఒప్పో మొదటిసారిగా చైనా కంటే ముందు ఇండియాలో తన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో 2, ఒప్పో రెనో 2Z మరియు ఒప్పో రెనో 2F అనే మూడు కొత్త రెనో 2 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ నిన్న అధికారికంగా విడుదల చేసింది. ఇప్పుడు ఒప్పో యొక్క తాజా వెర్షన్ రెనో 2Z స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌ కోసం అందుబాటులో ఉంచింది.

Oppo Reno 2Z  pre-order Live: price in India, Specifications and More

రెనో 2Z అనేది ఒప్పో రెనో 2 యొక్క కొంచెం సరసమైన వెర్షన్. ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కూడా అందిస్తుంది. ఫోన్‌కు షార్క్ ఫిన్-స్టైల్ పాప్-అప్ సెల్ఫీ విధానం లభించదు. రెనో 2Z ప్రీ-ఆర్డర్‌లలో అందించే ఆఫర్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుకు చదవండి.

ఒప్పో రెనో 2Z ధరల వివరాలు

ఒప్పో రెనో 2Z ధరల వివరాలు

ఒప్పో రెనో 2Z స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో 8 జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్‌తో వస్తుంది. దీని ధర సుమారు 29,990 రూపాయలు. ఒప్పో రెనో 2Z స్కై వైట్ మరియు బ్లాక్ వంటి రెండు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

ఒప్పో రెనో 2 సిరీస్ ధరల వివరాలు

ఒప్పో రెనో 2 సిరీస్ ధరల వివరాలు

ఒప్పో రెనో 2 కూడా ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. రెనో 2 స్మార్ట్‌ఫోన్‌ 8 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే అందుబాటులో ఉంది. దీని యొక్క ధర సుమారు 36,990 రూపాయలు. ఇది సెప్టెంబర్ 28 నుండి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.అలాగే ఒప్పో రెనో 2F కూడా 8 జిబి ర్యామ్‌ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ నవంబర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఒప్పో రెనో 2Z ప్రీ-బుకింగ్ వివరాలు

ఒప్పో రెనో 2Z ప్రీ-బుకింగ్ వివరాలు

ఒప్పో రెనో 2Z స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి అనుకున్నవారి కోసం ఒప్పో సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, స్నాప్‌డీల్, పేటీఎం మాల్ వంటి ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ యొక్క ఆఫ్‌లైన్ లభ్యతను కూడా కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క రెగ్యులర్ అమ్మకాలు సెప్టెంబర్ 6 నుండి జరుగుతాయి.

ఆఫర్స్

ఆఫర్స్

ఒప్పో రెనో 2 మరియు రెనో 2Z లకు బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డుతో ఎటువంటి ఖర్చు లేని నో-EMI ఆప్షన్ ఉంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో వినియోగదారులకు రూ.198 మరియు రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జీలపైన 100% అదనపు డేటాను అందిస్తున్నారు . ఇన్‌స్టాకాష్‌పై 10% అదనపు తగ్గింపు కూడా అందిస్తోంది. ఈ-కామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి 3,000 రూపాయల అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 10% తక్షణ తగ్గింపు ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ EMI ఆప్షన్ లభించుటలేదు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెనో 2Z గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080 x 2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఈ రెండు ఫోన్‌లలో షార్క్ ఫిన్-స్టైల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఇది ఫోన్ ఎగువ మధ్య అంచున 16 మెగాపిక్సెల్ లెన్స్‌తో స్టాండర్డ్ పాప్-అప్ కెమెరాను అందిస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

హ్యాండ్‌సెట్ యొక్క లోపలి భాగంలో మీడియాటెక్ హెలియో P 90 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. దీనితో పాటు ఇది 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే కెమెరా విభాగానికి వస్తే రెనో 2Z యొక్క వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో మొదటి కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ తో మరియు మూడవ,నాల్గవ కెమెరాలు 2 మెగాపిక్సెల్ మోనో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ తో వస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6 తో రన్ అవుతుంది. ఇది VOOC 3.0 ఛార్జింగ్‌కు మద్దతుతో ఉన్న 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో రెనో 2Z మరియు అన్ని రెనో 2 సిరీస్ ఫోన్‌లలో ఫీచర్స్ ఒకే విధంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 2Z pre-order Live: price in India, Specifications and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X