నోకియా 7.1, నోకియా 6.1లపై భారీ తగ్గింపు:RS.7,000 వరకు

|

ప్రముఖ ఫిన్నిష్ అప్‌స్టార్ట్ సంస్థ హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా 2018 సంవత్సరంలో భారతదేశంలో చాలా ముఖ్యమైన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా ఈ బ్రాండ్ ఫోన్లు గత సంవత్సరం ప్రారంభించిన వాయిదాల యొక్క తదుపరి డివైస్లను విడుదల చేస్తోంది. గత సంవత్సరం నోకియా నుంచి వచ్చిన కొన్ని ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్లలో నోకియా 6.1 మరియు నోకియా 7.1 ఉన్నాయి.

 
Nokia 7.1 and Nokia 6.1 Price Slashed in India

ఈ రెండు ఫోన్‌ల అమ్మకాలను ఇవ్వడానికి హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా 7.1 మరియు నోకియా 6.1 యొక్క ధరలను తగ్గించింది. నివేదిక ప్రకారం నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో నోకియా 7.1 మరియు నోకియా 6.1 యొక్క ధరలు కొత్త ధరలను ప్రతిబింబిస్తాయి. అయితే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్లలో ధరలు ఇంకా మార్పులను చూపించలేదు. నోకియా 6.1 ఒక సంవత్సరం క్రితం ఆగస్టు 2018 లో ప్రారంభించగా అలాగే నోకియా 7.1 కూడా గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ చేయబడింది.

నోకియా 7.1 కొత్త ధరల వివరాలు:

నోకియా 7.1 కొత్త ధరల వివరాలు:

నోకియా 7.1 గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ అయినప్పటి ధరకు మరియు ప్రస్తుతం నోకియా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కొత్తగా అప్డేట్ చేయబడిన ధరతో పోల్చితే నోకియా 7.1 ఫోన్ మొత్తం మీద 7,000 రూపాయలు ధర తగ్గింపును అందుకొని హైలైట్ గా ఉంది. నోకియా 7.1 ను 19,999 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ధర నోకియా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో 12,999 రూపాయలకు రిటైల్ చేయబడింది.నోకియా 7.1 ఫోన్ ఏప్రిల్‌లో ధర తగ్గింపును అందుకుంది. అప్పుడు దాని ధరను17,999 రూపాయలకు తగ్గించింది. నోకియా7.1కు భారీగా ధర తగ్గింపు పొందడంతో ఇప్పుడు దీనిని చాలా ఆకర్షణీయంగా కొనుగోలు చేయవచ్చు. మీలో ఎవరైనా దీనిని మీ చేతులలో పొందాలని కొంతకాలంగా ఆలోచిస్తూ ఉంటే దీని కంటే మంచి తరుణం ఇంకోటి రాదు.

నోకియా 7.1 స్పెసిఫికేషన్స్:
 

నోకియా 7.1 స్పెసిఫికేషన్స్:

నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ 5.84-అంగుళాల ఫుల్-హెచ్‌డి + ప్యూర్‌డిస్ప్లే ప్యానల్‌ను 19: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇందులోని స్క్రీన్ HDR10 కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 636 SoC ని కలిగి ఉంది. కెమెరా విషయంలో ఈ ఫోన్ వెనుక వైపు 12MP ప్రాధమిక సెన్సార్‌తో f / 1.8 లెన్స్‌తో మరియు 5MP సెకండరీ సెన్సార్‌తో f / 2.4 లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 8MP సెన్సార్‌తో f / 2.0 లెన్స్ మరియు 84-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 3,060mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

నోకియా 6.1 కొత్త ధరల వివరాలు:

నోకియా 6.1 కొత్త ధరల వివరాలు:

ఇప్పుడు నోకియా 6.1 యొక్క విషయానికి వస్తే నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లోని ఆన్‌లైన్ ధరల జాబితాలో 4 జిబి ర్యామ్ వేరియంట్‌ ఫోన్‌ను 11,999 రూపాయలకు తగ్గించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్ ధర కూడా ఇప్పుడు 14,999 రూపాయలకు తగ్గించబడింది. నోకియా 7.1 తో పోలిస్తే నోకియా 6.1 పై ధరల తగ్గింపు కొంచెం తక్కువ.ఇండియాలో నోకియా 6.1ను గత సంవత్సరం 4 జిబి ర్యామ్ వేరియంట్‌ను రూ .15,999 ధరతో లాంచ్ చేయగా, ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్‌ను 18,499 రూపాయలతో లాంచ్ చేశారు. ప్రస్తుతం తగ్గించిన ఈ ధరలు శాశ్వతంగా ఉంటాయో లేదో అని ఖచ్చితంగా తెలియదు. అవి ప్రచార అమ్మకంలో భాగమా అని ఖచ్చితంగా తెలియదు.

నోకియా 6.1 స్పెసిఫికేషన్స్:

నోకియా 6.1 స్పెసిఫికేషన్స్:

నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 5.8-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 SoC తో పాటు 4GB RAM మరియు 6GB RAM తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్‌లోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 16MP ప్రైమరీ సెన్సార్‌ను f / 2.0 లెన్స్ మరియు 1-మైక్రాన్ పిక్సెల్‌లతో వస్తుంది అలాగే సెకండరీ కెమెరా 5MP మోనోక్రోమ్ సెన్సార్ f/ 2.4 లెన్స్ మరియు 1.12-మైక్రాన్ పిక్సెల్‌లతో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక వైపు డ్యూయల్ టోన్ ఫ్లాష్ మాడ్యూల్ కూడా ఉంది.అలాగే సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఫోన్ ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్ 16MP సెన్సార్‌తో f/ 2.0 లెన్స్ మరియు 1-మైక్రాన్ పిక్సెల్‌లతో వస్తుంది. ఈ ఫోన్ 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia 7.1 and Nokia 6.1 Price Slashed in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X