Just In
Don't Miss
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఇండియాలో లాంచ్ అవుతున్న ఒప్పో రెనో2 సిరీస్:ధర,స్పెసిఫికేషన్స్
ఇండియాలో ఒప్పో రెనో 2 అధికారికంగా ఆగస్టు 28 న లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. BBK ఎలక్ట్రానిక్స్ సబ్ బ్రాండ్ ఒప్పో సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో రెనో 2 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు టీజ్ చేయడం ప్రారంభించింది. రెనో 2 సిరీస్ ఫోన్లు భారతదేశంలో తొలిసారిగా లాంచ్ అవుతుందని ఒప్పో ధృవీకరించింది. ఒప్పో రెనో మరియు రెనో 10x జూమ్ భారత మార్కెట్లోకి రావడానికి ముందే యూరోపియన్ మార్కెట్లలో రిలీజ్ అయ్యాయి.
ఒప్పో వారు ప్రతి సారి ఇతర దేశాలలో తమ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయకమునుపే భారత మార్కెట్లో చేస్తూఉంటారు కానీ ఈసారి ముందుగా రెనో2 సిరీస్ ఫోన్లను యూరోపియన్ మార్కెట్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సిరీస్ ఫోన్లలో ఒప్పో రెనో 2 సిరీస్ 20x జూమ్ మొబైల్ కూడా కలిగి ఉంటుందని ఒప్పో సంస్థ ధృవీకరించింది. అయితే ఇది డిజిటల్ జూమ్ విషయంలో ఒప్పో రెనో 10x జూమ్ వంటి ఆప్టికల్ జూమ్ అని మాత్రం నిర్ధారించలేదు. అలాగే ఒప్పో రెనో 2 సిరీస్‌లో వెనుక వైపు క్వాడ్ కెమెరాలు ఉంటాయి.

ఒప్పో రెనో 2 సిరీస్ చిప్‌సెట్:
ఒప్పో దాని ఒప్పో ఫైండ్ సిరీస్ ఫోన్‌లను భర్తీ చేస్తూ గత సంవత్సరం రెనో సిరీస్ ఫోన్‌లను ప్రవేశపెట్టింది. ఒప్పో రెనో 10X జూమ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 8GB వరకు ర్యామ్ మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది. బహుశా ఒప్పో రెనో 2 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది వరకు వన్‌ప్లస్ 7 ప్రో, ఆసుస్ 6Z మరియు రెడ్‌మిK20 ప్రో వంటి మొబైల్ లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో మార్కెట్లోకి ప్రవేశించాయి.

ఒప్పో ట్విట్టర్ నివేదిక:
ఒప్పో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన టీజర్ విషయానికొస్తే రెనో 2 సిరీస్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు ఉంటాయి మరియు 20x జూమ్ ఫీచర్‌ను అందిస్తాయి. ఒప్పో రెనో మరియు ఒప్పో రెనో 10x జూమ్ మాదిరిగా ఈ సంవత్సరం రెనో 2 సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ అవుతున్నట్లు ఒప్పో ట్విటర్ ద్వారా తెలిపారు. ఒప్పో రెనో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్‌తో ఇండియా మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు 28 న భారతదేశంలో విడుదల కానున్నాయి. రాబోయే రోజుల్లో ఒప్పో బ్రాండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మరిన్ని వివరాలను వెల్లడిస్తుందని ఆశిద్దాము.

స్పెసిఫికేషన్స్:
ఒప్పో 5x ఆప్టికల్ జూమ్ మరియు 20x డిజిటల్ జూమ్‌ను అందిస్తుందా లేదా వేరే సెటప్ ఉందా అనేది చూడవలసిన ముఖ్యమైన విషయం. మెరుగైన పదునుతో 20x డిజిటల్ జూమ్ కూడా స్మార్ట్‌ఫోన్‌కు గొప్ప ఫీట్ అవుతుంది. హువాయి P30 ప్రో మరియు ఒప్పో రెనో 10x జూమ్ రెండు పెరిస్కోప్-స్టైల్ కెమెరాను ఉపయోగిస్తాయి మరియు 5x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తాయి. రెనో 2 ఇందులో వేరే సెటప్ కోసం వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇది సోనీ యొక్క 48-మెగాపిక్సెల్ IMX586 ఇమేజ్ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నట్లు డిజైన్ సూచిస్తుంది. ఒప్పో ఈ కెమెరా కటౌట్‌ల కోసం వేర్వేరు పరిమాణాలను ఉపయోగిస్తోంది.
రెనో 2 స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే మరియు ఫుల్‌వ్యూ డిస్ప్లేతో వస్తుందని ఇప్పటివరకు వచ్చిన టీజర్ సూచిస్తున్నాయి. ఇది 4,065mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌ను కలిగి ఉంది. దానితో పాటు 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న రెనో స్మార్ట్‌ఫోన్‌ల కంటే రెనో 2 ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500