Oppo Reno 3 Pro స్మార్ట్‌ఫోన్‌ మీద భారీ ధర తగ్గింపు...

|

ఇండియాలోని ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ లలో ఒప్పో సంస్థ ఫోన్లు కూడా ఉన్నాయి. ఒప్పో సంస్థ ఈ సంవత్సరం విడుదల చేసిన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో రెనో 3 ప్రో కూడా ఒకటి. ఇప్పుడు ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క‌ ధరను సంస్థ తగ్గించింది.

 

ఒప్పో రెనో 3 ప్రో తగ్గింపు ధరల వివరాలు

ఒప్పో రెనో 3 ప్రో తగ్గింపు ధరల వివరాలు

ఈ ఏడాది ప్రారంభంలో ఒప్పో రెనో 3 ప్రోను 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.29,990 ధర వద్ద విడుదల చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌ మీద రూ.2,000 వరకు ధరను తగ్గించి కొనుగోలుదారులకు కేవలం రూ.27,990 వద్ద కంపెనీ అందిస్తోంది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.29,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇండియా యొక్క మార్కెట్లో ప్రస్తుతం రెనో 4 ప్రో ధరల తగ్గింపు ప్రస్తుతం అమలులో ఉంది.

ఒప్పో రెనో 3 ప్రో లభ్యత వివరాలు

ఒప్పో రెనో 3 ప్రో లభ్యత వివరాలు

ఒప్పో రెనో 3 ప్రో ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండూ కూడా ప్రస్తుతం కొత్త ధరల వద్ద దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించబడనున్నాయి. ధర తగ్గింపు మీద కంపెనీ ఎటువంటి టైమ్‌లైన్ ను ఇవ్వలేదు కనుక ఇవి శాశ్వత మార్పులు అని సూచిస్తున్నాయి. ఒప్పో రెనో 3 ప్రో ఫోన్ యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 తో మరియు వెనుక ప్యానెల్‌లో రిఫ్లెక్టివ్ గ్లాస్-ఫినిష్‌ రక్షణతో వస్తుంది. సంస్థ మూడు ఆసక్తికరమైన కలర్ ఎంపికలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది.

ఒప్పో రెనో 3ప్రో కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్
 

ఒప్పో రెనో 3ప్రో కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్

జూలై నెలలో జూలై 2020 ప్యాచ్‌తో ఫోన్ సాధారణ నెలవారీ ఆండ్రాయిడ్ అప్ డేట్ ను కొత్తగా పొందింది. ఒప్పో రెనో 3 ప్రో హ్యాండ్‌సెట్ కోసం కొత్త అప్ డేట్ లో సాఫ్ట్‌వేర్ వెర్షన్ CPH2035_11_A.19 కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొత్త సాఫ్ట్‌వేర్ కలర్‌ఓఎస్ 7.1 వెర్షన్ ఆధారంగా సరికొత్త ఆండ్రాయిడ్ 10 OS‌లో ఫోన్ రన్ అవుతుంది.

ఒప్పో రెనో 3ప్రో స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 3ప్రో స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 3ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్ లలో ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అందిస్తుందని భావిస్తున్నారు. ఇది 2.8GHz క్లాక్ వేగంతో మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో సంస్థ దీనిని 8 జిబి ర్యామ్ / 128జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్/ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లలో అందిస్తుంది.

ఒప్పో రెనో 3ప్రో కెమెరా సెటప్

ఒప్పో రెనో 3ప్రో కెమెరా సెటప్

ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1తో రన్ అవుతున్నట్లు దీనిని డిజైన్ చేసారు. ఇమేజింగ్ కోసం దీని యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ రెండవ కెమెరాతో జతచేయబడుతుంది.అలాగే 13 మెగాపిక్సెల్ మాక్రో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో 44 మెగాపిక్సెల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి.

ఒప్పో రెనో 3ప్రో 5000mAh బ్యాటరీ

ఒప్పో రెనో 3ప్రో 5000mAh బ్యాటరీ

ఒప్పో రెనో 3ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతుతో రానున్నది. ఈ ఫోన్ వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo Reno 3 Pro Price Slashed in India Up to Rs.2,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X