Oppo నుంచి మరో కొత్త ఫోన్!! క్వాడ్ కెమెరా సెటప్, 4000mAh బ్యాటరీ ఫీచర్లతో...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారి సంస్థ ఒప్పో ఇండియాలో కొత్తగా ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ లాంచ్ కార్యక్రమం ద్వారా ఈ రోజు విడుదల చేసారు. భారతదేశంలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ అంతర్జాతీయంగా లభించే వేరియంట్‌కు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇండియాలో రూ.34,990 ధర వద్ద స్టార్రి నైట్ మరియు సిల్కీ వైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర మరియు సేల్స్ డేట్ వివరాలు
 

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర మరియు సేల్స్ డేట్ వివరాలు

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్‌లో విడుదల అయింది. ఈ వేరియంట్ స్టార్రి నైట్ మరియు సిల్కీ వైట్ వంటి కలర్ ఎంపికలో రూ.34,990 ధర వద్ద లాంచ్ అయింది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం మాల్, మరియు టాటా క్లిక్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, సంగీత, పూర్వికా వంటి వివిధ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్టోర్లలో ఆగస్టు 5 నుండి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. ఎంచుకున్న బ్యాంకుల నుండి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది మరియు ఒప్పో కేర్ ప్లస్, ఒప్పో అప్‌గ్రేడ్ మరియు నో కాస్ట్ ఇఎంఐ ఎంపికలు ఉన్నాయి.

ఒప్పో రెనో 4 ప్రో  Vs  ఇతర స్మార్ట్‌ఫోన్లు

ఒప్పో రెనో 4 ప్రో Vs ఇతర స్మార్ట్‌ఫోన్లు

ఇండియాలో రూ.30,000 ధర విభాగంలో ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ వివో X50, శామ్‌సంగ్ గెలాక్సీ A71 మరియు ఒప్పో నార్డ్ వంటి కొన్ని ఇతర బ్రాండ్‌లతో గట్టి పోటీని ఎదురుకోనున్నది. చైనా కంపెనీ ఒప్పో తన రెనో 4 ప్రో యొక్క ఇండియన్ వేరియంట్ కోసం ప్రాసెసర్‌ను మార్చింది. ఒరిజినల్ మోడల్‌లలో గల స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌కి బదులుగా ఇండియా యొక్క వేరియంట్ లో స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. చైనీస్ వేరియంట్‌కు అందుబాటులో ఉన్న డిస్‌ప్లే యొక్క HDR10 + ఫీచర్ కూడా ఇండియన్ వేరియంట్‌లో లేదు.

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో కలర్‌ఓఎస్ 7.2 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + 3D బోర్డర్‌లెస్ సెన్స్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో 90HZ రిఫ్రెష్ రేట్ నుండి 180HZ వరకు కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC చిప్ సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉండి 8GB LPDDR4X RAMతో జతచేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ మల్టీ-కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఒప్పో రెనో 4 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్
 

ఒప్పో రెనో 4 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్

మెరుగైన ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పో రెనో 4 ప్రో వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.7 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX586 సెన్సార్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో మిగిలిన రెండు కెమెరాలు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మోనో షూటర్ కూడా ఉన్నాయి. ఇంకా సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f / 2.4 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

ఒప్పో రెనో 4 ప్రో కనెక్టివిటీ

ఒప్పో రెనో 4 ప్రో కనెక్టివిటీ

ఒప్పో రెనో 4 ప్రో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ V5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ / నావిక్, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది.

ఒప్పో రెనో 4 ప్రో 4000mAh బ్యాటరీ

ఒప్పో రెనో 4 ప్రో 4000mAh బ్యాటరీ

ఒప్పో రెనో 4 ప్రో 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 65W సూపర్ వూక్ 2.0 ద్వారా వేగంగా ఛార్జ్ చేయడానికి మద్దతును ఇస్తుంది. ప్రీలోడెడ్ సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఇది కేవలం ఐదు శాతం బ్యాటరీతో వాట్సాప్‌లో 1.5 గంటలు చాట్ చేయడానికి లేదా 77 నిమిషాలు కాల్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 160.2x73.2x7.7mm కొలతల పరిమాణంలో ఉండి 161 గ్రాముల బరువుతో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo Reno 4 Pro Released in India with 4000mAh Battery Capacity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X