పేటీఎంకే రక్షణ లేదు, మస్కా కొట్టిన కేటుగాళ్లు !

Written By:

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా పేటీఎమ్ సేవలు పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పేటీఎమ్ కే కష్టాలు మొదలయ్యాయి. 48 మంది కష్టమర్లు పేటీఎమ్ ని దాదాపు రూ. 6.15 లక్షల మేర మోసం చేశారని సీబీఐకి స్వయంగా పేటీఎమ్ ఫిర్యాదు చేసింది.

వాట్సప్‌లోకి మళ్లీ కొత్త ఫీచర్

పేటీఎంకే రక్షణ లేదు, మస్కా కొట్టిన కేటుగాళ్లు !

దీనిపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. పేటీఎమ్ ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద వ్యాలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఇందులో 150 మిలియన్ వ్యాలెట్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి. నవంబర్ 8న నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయంతో పేటీఎమ్ ఒక్కసారిగా పుంజుకుంది. అయితే గత వారం పేటీఎంను మోసం చేశారనే వార్తలు వెలుగుచూశాయి.

రూ. 3వేలకే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్

పేటీఎంకే రక్షణ లేదు, మస్కా కొట్టిన కేటుగాళ్లు !

దీంతో జనాల్లో కొంచెం ఆందోళన మొదలవడంతో పేటీఎమ్ ఈ విషయంపై సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి డిజిటల్ వ్యాలెట్ సంస్థలకు ఇప్పుడు రక్షణ ఉండటం లేదని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
PayTM claims 48 customers cheated it of more than Rs 6 lakh, CBI registers case Read more at Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting